
Krish Jagarlamudi : డైరెక్టర్ క్రిష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో సందేశాత్మక, హిస్టరికల్ సినిమాలను అందించారు. అయితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీని కొంత పార్ట్ డైరెక్ట్ చేసిన ఆయన ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత 'హరిహర వీరమల్లు' మూవీకి ప్రొడ్యూసర్ ఎఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. తాజాగా డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై స్పష్టత ఇచ్చారు క్రిష్. ఇంతకీ ఏమన్నారంటే..?
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఘాటి’. ఈ చిత్రానికి విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించారు. విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ మూవీ ప్రమోషన్లలో పాల్గొనారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మూవీ 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను వివరించారు.
ప్రెస్ మీట్ లో క్రిష్ మాట్లాడుతూ.. తనకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని, అలాగే ఎఎం రత్నం అంటే అమితమైన గౌరవమని చెప్పారు. ప్రతీ సినిమా తనకు ఒక జర్నీ లాంటిదనీ, హరిహర వీరమల్లు కొంత భాగం తీశానని తెలిపారు. పవన్ కల్యాణ్ అంటే తనకు ప్రేమ, గౌరవం ఉందన్నారు. తాను చిన్నప్పటి నుండి సూర్య మూవీస్ పోస్టర్స్ చూసి ఎప్పుడైనా ఏఎం రత్నం గారితో పని చేయాలని కలగన్నానని గుర్తుచేశారు. అయితే.. కొన్ని షెడ్యూల్ కారణాల వల్ల 'హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందనీ, ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత కోవిడ్ ప్రారంభం కావడం, ఇతర కారణాల వల్ల ఆలస్యమైందని తెలిపారు.
ఆ సినిమాలో తన జర్నీ పూర్తి కావడంతో డైరెక్టర్ జ్యోతికృష్ణ కంటిన్యూ చేశారని తెలిపారు. తాను ‘హరిహర వీరమల్లూ’ నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా ‘ఘాటి’ సినిమాపై ఫోకస్ చేసి సన్నాహాలు పూర్తి చేశారని తెలిపారు. ‘ఘాటి’ సినిమా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, క్రిష్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.