వెంకీ స్పీడ్‌ మామూలుగా లేదుగా.. `దృశ్యం2` షూటింగ్‌ కంప్లీట్‌..

Published : Apr 15, 2021, 12:16 PM IST
వెంకీ స్పీడ్‌ మామూలుగా లేదుగా.. `దృశ్యం2` షూటింగ్‌ కంప్లీట్‌..

సారాంశం

`దృశ్యం2` సినిమా మొత్తం షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుందని, త్వరలోనే అది కూడా పూర్తవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తుంది యూనిట్‌. 

వెంకటేష్‌ నటించిన `దృశ్యం` సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా మలయాళ రీమేక్‌గా రూపొంది విశేషంగా అలరించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా `దృశ్యం2` చిత్రం రూపొందుతుంది. వెంకటేష్‌ హీరోగా, మీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మాతృక దర్శకుడు జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి మొదటి వారంలో సినిమా ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల్లోనే తన పార్ట్షూటింగ్‌ని కంప్లీట్‌ చేశాడు హీరో వెంకీ. గురువారం తన పార్ట్ షూటింగ్‌ని పూర్తి చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. 

సినిమా మొత్తం షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుందని, త్వరలోనే అది కూడా పూర్తవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తుంది యూనిట్‌. దీన్ని సురేష్‌ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్‌బాబు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `దృశ్యం2`కిది రీమేక్‌. మలయాళంలో మోహన్‌లాల్‌, మీనా  జంటగా నటించారు. అది సూపర్‌ హిట్‌ కావడంతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకీ నుంచి ఈ ఏడాది మూడు సినిమాలు రాబోతుంది. తమిళ `అసురన్‌` రీమేక్‌ `నారప్ప` మే 14న విడుదల కానుంది. ఆ తర్వాత `దృశ్యం2` రిలీజ్‌ కానుంది. ఆగస్ట్ లో `ఎఫ్‌3`ని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..