మహేష్‌ ఏఎంబీ మల్టీఫ్లెక్స్ కి అంతర్జాతీయ గుర్తింపు.. !

Published : Apr 15, 2021, 10:12 AM IST
మహేష్‌ ఏఎంబీ మల్టీఫ్లెక్స్ కి అంతర్జాతీయ గుర్తింపు.. !

సారాంశం

మహేష్‌బాబు, ఏషియన్స్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబీ(ఏషియన్‌-మహేష్‌బాబు) మల్టీఫ్లెక్స్ ని నిర్మించిన విషయం తెలిసిందే. వరల్డ్ క్లాస్‌ ప్రమాణాలతో రూపొందించిన దీనికి తాజాగా అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.

మహేష్‌బాబు, ఏషియన్స్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబీ(ఏషియన్‌-మహేష్‌బాబు) మల్టీఫ్లెక్స్ ని నిర్మించిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఇది ప్రారంభమైంది. అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అత్యంత లగ్జరీగా ఈ మల్టీఫ్లెక్స్ ని నగరంలో గచ్చిబౌలిలో దీన్ని రూపొందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంటీరియర్ డిజైన్‌తో మొత్తం 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ లాంజ్, పార్టీ జోన్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ తదితర సదుపాయాలతో `ఏఎంబీ సినిమాస్` ప్రేక్షకులకు వరల్డ్ క్లాస్ అనుభూతిని కలిగిస్తోంది. 

తాజాగా దీనికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. `ఇనవేషన్ అవార్డ్స్-2021`లో గ్లోబల్ గుర్తింపును పొందినట్లు తాజాగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇనవేషన్ అవార్డ్స్-2021లో లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఏఎంబీ సినిమాస్ ఫైనలిస్టుగా ఎంపికవడం విశేషం. ఎవి ఇంటిగ్రేషన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ వారు ఈ కేటగిరీలో భారతదేశం నుండి  `ఏఎంబీ సినిమాస్` మల్టీప్లెక్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా AMB సినిమాస్ బృందానికి అభినందనలు తెలియజేస్తూ, ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..