F3:వెంకటేష్ బర్తడే స్పెషల్ వీడియో

Surya Prakash   | Asianet News
Published : Dec 13, 2021, 11:57 AM ISTUpdated : Dec 13, 2021, 11:59 AM IST
F3:వెంకటేష్ బర్తడే  స్పెషల్ వీడియో

సారాంశం

వెంకటేష్ పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్రం టీమ్ ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.


 అనిల్ రావిపూడి దర్శకత్వంలో  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది.  చాలా కాలం తర్వాత వెంకటేష్‌లోని ఫన్ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2 పేరు తెచ్చుకుంది.  మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది.  దాంతో ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఏ స్దాయిలో  ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరసగా ఐదు సక్సెస్ ల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్.  ఎఫ్ 3 మూవీ విడుదల తేదీని వచ్చే ఏడాది 2022, ఫిబ్రవరి 25కు మార్చారు.  

ఎఫ్‌2 సూపర్‌ హిట్‌ కావడంతో.. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్‌3పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ ఆసాంతం నవ్వుల ఝల్లు కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను రెడీ చేశారట. ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ప్రక్కన పెడితే వెంకటేష్ పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్రం టీమ్ ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

Also read Allu Arjun: బాలయ్యకు అల్లు అర్జున్ పార్టీ.. అల్లు, నందమూరి బంధం బలపడుతోందే

ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. 

Also read Nagarjuna: 1000 ఎకరాల ఫారెస్ట్ ని దత్తత తీసుకోనున్న కింగ్ నాగార్జున
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే