యంగ్ డైరెక్టర్ తో వెంకీ 75వ చిత్రం... ఆసక్తి రేపుతున్న ప్రీ అనౌన్స్మెంట్ పోస్టర్!

Published : Jan 23, 2023, 11:59 AM IST
యంగ్ డైరెక్టర్ తో వెంకీ 75వ చిత్రం... ఆసక్తి రేపుతున్న ప్రీ అనౌన్స్మెంట్ పోస్టర్!

సారాంశం

వెంకటేష్ ప్రతిష్టాత్మక 75వ చిత్రం ప్రకటించారు హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో మూవీ చేస్తున్నట్లు వెల్లడించారు.   

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా అదే. గత ఏడాది ఆయన ఎఫ్ 3, ఓరి దేవుడా చిత్రాలతో అలరించారు. మల్టీస్టారర్స్, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. సోలో చిత్రాలు తగ్గించేసిన వెంకటేష్ ప్రతిష్టాత్మక 75వ చిత్రం దర్శకుడు శైలేష్ కొలనుతో ప్రకటించారు. నేడు దీనికి సంబంధించిన ప్రీ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. 

సీరియస్ అండ్ ఇంటెన్స్ థీమ్ తో కూడిన పోస్టర్ ఆసక్తి రేపుతోంది. చేతిలో గన్ పట్టుకొని ఉన్న వెంకీ ప్రళయానికి ఎదురెళుతున్నట్లు ఉంది. కొద్దిరోజులుగా హిట్ డైరెక్టర్ తో వెంకీ మూవీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. నేడు వెంకీ అధికారికంగా ప్రకటించారు. జనవరి 25న పూర్తి వివరాలతో ప్రకటన చేయనున్నట్లు తెలియజేశారు. 

హిట్, హిట్ 2 చిత్రాలతో శైలేష్ కొలను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు. దీంతో వెంకీ ఆయనకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. శ్యామ్ సింగరాయ్ నిర్మాత వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు 25న తెలియనున్నాయి. 

కాగా శైలేష్ కొలను ఆల్రెడీ నాని హీరోగా హిట్ 3 ప్రకటించారు. మరో వెంకీ ప్రాజెక్ట్ హిట్ 3 తర్వాతనా లేక ఆ ప్రాజెక్ట్ రావడానికి ముందే కంప్లీట్ చేస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. నాని దసరా మూవీ చేస్తున్నారు. అలాగే ఇటీవల ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తో వెంకీ మూవీ ఉంటుందంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. వెంకీ మాత్రం శైలేష్ కొలనుకు అవకాశం ఇచ్చారు.  
 

PREV
click me!

Recommended Stories

The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే
BMW vs Anaganaga Oka Raju: రవితేజకి నవీన్‌ పొలిశెట్టి బిగ్‌ షాక్‌.. `అనగనగా ఒక రాజు`కి ఊహించని కలెక్షన్లు