నందమూరి నటసింహం బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న చిత్రం ‘ఎన్బీకే108’. చిత్రంపై అంచనాలు పెంచేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు.
‘వీరసింహారెడ్డి’ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ (Balakrishna) సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నటిస్తున్నారు. ‘ఎన్బీకే108’ వర్క్ టైటిల్ తో సినిమాను రూపుదిద్దుకుంటోంది. గతేడాది డిసెంబర్ 8న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇంతకీ బాలయ్యను అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నారని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తుున్నారు.
ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్య అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన Veera Simha Reddy సక్సెస్ సెలబ్రేషన్స్ కు అనిల్ కూడా హాజరై మాట్లాడారు. ‘బాలయ్య వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం బాలయ్య సీజన్ నడుస్తోంది. ‘ఎన్బీకే108’లో ఈసారి అన్న తెలంగాణలో దిగుతుండు. ఇక బాక్సాఫీస్ వద్ద ఉచకోత మరోసారి మొదలవుతుంది. పవర్ ఫుల్ క్యారెక్టర్ తో రాబోతున్నార’ని తెలిపారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తెలంగాణ నేపథ్యంలో సినిమా కథ ఉండబోతోందని డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. అప్పటికీ బాలయ్య సినిమాలంటే డైలాగ్స్, మాస్ యాక్షన్ సీన్స్ ను ఫ్యాన్స్ ఎక్స్ పెంట్ చేస్తుంటారు. వాటన్నింటిని రీచ్ అయ్యేలా సినిమా తెరకెక్కిస్తున్నారంట. ‘వీరసింహారెడ్డి’తో మరోసారి ఫ్యాక్షన్ రుచి చూపించిన బాలయ్య తెలంగాణ యాసలో అలరించబోతుండటం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మూవీ నెక్ట్స్ షెడ్యూల్ కు సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మాస్ యాక్షన్ సీక్వెల్స్ ను చిత్రీకరిస్తున్నారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ తదితర సీనియర్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కూతురి పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలీలా (Sree leela) కనిపించనుందంట. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.