హరీష్ శంకర్ మాటలు..బాలయ్య ప్యాన్స్ కు భలే కిక్కు

By Surya PrakashFirst Published Jan 23, 2023, 11:32 AM IST
Highlights

 ఒక్క షాట్ డైరెక్ట్ చేస్తేనే రిజల్ట్ ఇలా ఉంటే... రేపు సినిమా డైరెక్ట్ చేస్తే? అతి త్వరలో బాలయ్య బాబు గారిని ఒప్పించి,...


యువ దర్శకులు  నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని హరీష్ శంకర్ కూడా ఉన్నారు. ఆయన కూడా స్టేజిపై బాలయ్యను స్వయంగా కథ ఒప్పించి సినిమా చేస్తానని చెప్పారు. ఇదంతా ... 'వీర సింహా రెడ్డి' విజయోత్సవ సభలో జరిగింది. తొలి రోజే రికార్డ్ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా 54 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి బెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన వీర సింహారెడ్డి అదే స్పీడు కొనసాగిస్తూ 10 డేస్ రన్ పూర్తి చేశారు. అయితే ఈ సినిమా సక్సెస్ పట్ల ఎంతో ఖుషీగా ఉన్న చిత్రయూనిట్.. వీర సింహుడి విజయోత్సవ వేడుకను హైదరాబాద్ లో చేశారు.
 
  హరీష్ శంకర్ మాట్లాడుతూ ''మా బావ గోపీచంద్ మలినేనికి గుర్తు ఉందో? లేదో? నేనే 'వీర సింహా రెడ్డి' ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశా.  'నువ్వు ఎప్పుడూ బాలకృష్ణను డైరెక్ట్ చేయలేదు కదా! రేపు ఓపెనింగ్ ఉంది. వచ్చి ఒక్క షాట్ చెయ్' అని నన్ను ఇన్వైట్ చేశాడు. ఒక్క షాట్ డైరెక్ట్ చేస్తేనే రిజల్ట్ ఇలా ఉంటే... రేపు సినిమా డైరెక్ట్ చేస్తే? అతి త్వరలో బాలయ్య బాబు గారిని ఒప్పించి, మంచి కథతో ఆయన అనుమతి  తీసుకుని సినిమా డైరెక్ట్ చేయడానికి చాలా చాలా ఉత్సాహ పడుతున్నాను. ఇది కేవలం నా కోరిక మాత్రమే కాదు... మా నిర్మాతల కోరిక కూడా'' అని చెప్పారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో ఒకరిగా హరీష్ శంకర్ పేరు తెచ్చుకున్నారు. తనను తాను పవన్ భక్తుడిగా చెప్తారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'రామయ్యా వస్తావయ్యా' సినిమా చేశారు. ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.  

ఆదివారం నాడు వీర సింహారెడ్డి సినిమా సక్సెస్‌ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు కుర్ర హీరోలు ముఖ్య అతిథులుగా వచ్చారు. విశ్వక్ సేన్, సిద్దు, హరీష్‌ శంకర్ వంటివారంతా వచ్చారు.  వీర సింహా రెడ్డి సినిమా దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తోంది. ఈ సక్సెస్ సెలబ్రేషన్ లో బాలకృష్ణ ఆసక్తికరంగా మాట్లాడుతూ మరోసారి నందమూరి అభిమానులకు కిక్కిచ్చారు. వేదికపై తన మాటలతో, తన పద్యాలతో మరోసారి ఆకట్టుకున్నారు బాలకృష్ణ. వీరసింహారెడ్డి చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ బాలయ్య ప్రసంగం కొనసాగింది.

click me!