రియాలిటీ షో కోసం వెంకీ, రానా.. సరికొత్తగా ! సౌత్‌బేలోనూ సందడి!

Published : Nov 15, 2020, 12:40 PM IST
రియాలిటీ షో కోసం వెంకీ, రానా.. సరికొత్తగా ! సౌత్‌బేలోనూ సందడి!

సారాంశం

 సమంత `సామ్‌జామ్‌` పేరుతో ఓ రియాలిటీ షోకి హోస్ట్ చేస్తుంది. నాగార్జున `బిగ్‌బాస్‌` చేస్తున్నాడు. నాని, చిరంజీవి, ఎన్టీఆర్‌, రానా వంటి వారు రియాలిటీ షోస్‌కి హోస్ట్ గా చేశారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌ కూడా హోస్ట్ గా మారబోతున్నారు. 

కరోనా, లాక్‌డౌన్‌..డిజిటల్‌ మాధ్యమాలకు ప్రయారిటీ పెంచింది. డిజిటల్‌ కంటెంట్‌కి ప్రాధాన్యత పెరిగింది. స్టార్స్ సైతం డిజిటల్‌ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మరోవైపు తారలు హోస్ట్ లుగా మారిపోతున్నారు. సమంత `సామ్‌జామ్‌` పేరుతో ఓ రియాలిటీ షోకి హోస్ట్ చేస్తుంది. నాగార్జున `బిగ్‌బాస్‌` చేస్తున్నాడు. నాని, చిరంజీవి, ఎన్టీఆర్‌, రానా వంటి వారు రియాలిటీ షోస్‌కి హోస్ట్ గా చేశారు. 

ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌ కూడా హోస్ట్ గా మారబోతున్నారు. తన అబ్బాయి రానాతో కలిసి ఓ రియాలిటీ షో చేయబోతున్నట్టు తెలుస్తుంది. వీరి కాంబినేషన్‌లో ఓ రియాలిటీ షో చేయడానికి ప్రముఖ టీవీ ఛానెల్‌ ప్లాన్‌ చేసిందట. ఇప్పటికే రానా హోస్ట్ చేసిన `నెంబర్‌ వన్‌ యారీ` షోలో వెంకటేష్‌ కనిపించి సందడి చేశారు. అయితే ఈ సారి వీరిద్దరు కలిసి రియాలిటీ షో చేయబోతున్నారట. గతంలో కంటే భిన్నంగా ఈ షోని డిజైన్‌ చేశారట. సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఫస్ట్ టైమ్‌ వెంకీ చేయబోతున్న ఈ షో ఎలా ఉంటుందనేది ఆసక్తి నెలకొంది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఓ తమిళ రీమేక్‌లో వీరిద్దరు హీరోలుగా నటిస్తారని, అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతోపాటు ఇటీవల రానా `సౌత్‌బే` పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రారంభించారు. ఇందులో నిర్వహించే లవ్‌ ప్రోగ్రామ్‌కి వెంకీ హాజరయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పాల్గొన్నారు. ఈషోలో తాప్సీ, మంచు లక్ష్మి కూడా పాల్గొనడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు