బిగ్‌బాస్‌4ః ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది మెహబూబేనా?

Published : Nov 15, 2020, 07:46 AM IST
బిగ్‌బాస్‌4ః ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది మెహబూబేనా?

సారాంశం

 పదోవారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్‌లో ఉన్న అభిజిత్‌ సేవ్‌ అయ్యాడు. మెహబూబ్‌, అరియానా, మోనాల్‌, సోహైల్‌, హారిక ఉన్నారు. వీరిలో ఈ వారం వెళ్ళేది ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది. అరియానా, మెహబూబ్‌, హారిక పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

బిగ్‌బాస్‌ శనివారం ఎపిసోడ్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అఖిల్‌తో గేమ్‌ ఆడుకున్నాడు. ఓ డ్రామా క్రియేట్‌ చేశాడు. హోస్ట్ నాగ్‌ రూపంలో అప్పటికప్పుడు అఖిల్‌ ఎలిమినేటెడ్‌ అని షాక్‌ ఇచ్చాడు. ఎప్పటిలాగే తన మార్క్ సస్పెన్స్ ని క్రియేట్‌ చేసి చివరి నిమిషంలో అఖిల్‌ వెళ్లడం లేదు అని చెప్పేశాడు. అయితే ఈ ఎపిసోడ్‌ అంతా ఆడియెన్స్, ఇంటి సభ్యులు ఊహిస్తూనే ఉంటారు. కచ్చితంగా ఇదే జరుగుతుందని అనుకుంటున్నారు. కాస్త టెన్షన్‌ క్రియేట్‌ చేసిన నాగ్‌ తుస్సుమనిపించాడు. 

ఇక పదోవారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్‌లో ఉన్న అభిజిత్‌ సేవ్‌ అయ్యాడు. మెహబూబ్‌, అరియానా, మోనాల్‌, సోహైల్‌, హారిక ఉన్నారు. వీరిలో ఈ వారం వెళ్ళేది ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది. అరియానా, మెహబూబ్‌, హారిక పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పదో వారం మాత్రం మెహబూబ్‌ వెళ్లిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

గేమ్స్ విన్నర్‌గా నిలుస్తున్న మెహబూబ్‌ మిగతా విషయాల్లో అంతా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఆయన కేవలం సోహైల్‌తోనే రిలేషన్‌ మెయిన్‌టేన్‌ చేస్తున్నారు. మిగలిన వారితో ఆయనకు అంత ర్యాపో లేదు. పైగా ఇంట్లో ఆయన్నుంచి ఎలాంటి హడావుడి కూడా ఉండదు. చాలా వరకు సైలెంట్‌గానే ఉండిపోతాడు. దీంతో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది మెహబూబ్‌ అనే తెలుస్తుంది. మరోవైపు హారిక పేరు కూడా వినిపిస్తుంది. కానీ అమ్మాయిలను పంపిస్తే గ్లామర్‌ తగ్గిపోతుంది. బిగ్‌బాస్‌ ఈ వారం మాత్రం ఆ సాహసం చేసే ఛాన్స్ లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు