నేడు సోషల్ మీడియాను ఓ ఫోటో షేక్ చేస్తుంది. సదరు ఫోటోలో మహేష్ బాబు, వెంకటేష్ పక్క పక్కనే కూర్చుని పేకాట ఆడుతున్నారు.
మహేష్ బాబు-వెంకటేష్ చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. పనుంటే తప్ప బయటకు రారు. తమ చిత్రాల ప్రొమోషన్స్ లో మినహాయిస్తే పెద్దగా కనిపించరు. పక్కా ప్రొఫెషనల్ గా ఉంటారు. కాగా వీరిద్దరూ క్లబ్ లో పేకాటరాయళ్ళుగా దర్శనమివ్వడం చర్చకు దారి తీసింది. టేబుల్ మధ్యలో లక్షల రూపాయలు ఉన్నాయి. మహేష్ చేతిలో పేక ఉంది. వెంకీ ముందు టేబుల్ పై పేకలు ఉన్నాయి.
ఇంత పబ్లిక్ గా క్లబ్ లో పేకాట ఆడే సాహసం ఎలా చేశారని అందరూ షాక్ అవుతున్నారు. ఆరా తీస్తే... ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ పార్టీకి వెంకటేష్-మహేష్ హాజరయ్యారు. ఆ పార్టీలో కాసేపు సరదాగా పేకాట ఆడారని సమాచారం. ఆ సమయంలో ఎవరో దూరం నుండి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ అవుతుంది.
ఇక మహేష్-వెంకీ కలిసి మల్టీస్టారర్ చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైటిల్ తో తెరకెక్కించిన చిత్రంలో ఈ స్టార్ హీరోలు అన్నదమ్ముల పాత్రలు చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 12న విడుదల కానుంది.
వెంకటేష్ సైంధవ్ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. సైంధవ్ మూవీ వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల కానుంది. కాగా సైంధవ్ సైతం సంక్రాంతి బరిలో ఉంది. జనవరి 13 విడుదల తేదీగా ప్రకటించారు. వెంకీ-మహేష్ లలో మధ్య పోటీ రసవత్తరం కానుంది.