అభిమానులకే అభిమాని అనిపించిన రాఘవా లారెన్స్.. అభినందనలు కూడా తక్కువే!

By Asianet News  |  First Published Nov 5, 2023, 4:52 PM IST

తమిళ స్టార్ రాఘవా లారెన్స్ తన అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ను ఇచ్చారు. ఏ అభిమానికి దక్కనిది అతనికి సొంతం కావడంతో ఫిదా అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
 


స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence)కు డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారన్న విషయం తెలిసిందే. అతని సినిమాలు, పెర్ఫామెన్స్ కంటే ఆయన వ్యక్తిత్వంతోనే ఎక్కువ మంది అభిమానులను దక్కించుకున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తనపై ఎప్పుడూ అభిమాన వర్షం కురిపిస్తూనే ఉంటారు. ఇక ఆయన సినిమా వేడుకల్లో మరింతగా సందడి  చేస్తుంటారు. ప్రస్తుతం రాఘవా లారెన్స్ ‘జిగర్ తండా’ (Jigar Thanda) చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

‘జిగర్ తండా’ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రధాన్ కన్వెన్షన్ హాల్ నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ (Venkatesh)  చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ వేడుకకు అభిమానులు సైతం పోటెత్తారు. కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అయితే వేడుకలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. రాఘవా లారెన్స్ స్పీచ్ ఇచ్చే సమయంలో ఓ అభిమానికి వేదికపైకి దూసుకొచ్చారు. అతనితో రాఘవా లారెన్స్ ప్రవర్తించిన తీరు అందరి చేత ప్రశంసలు కురిపిస్తోంది.  

Latest Videos

undefined

రాఘవా లారెన్స్ వేదికపై మాట్లాడుతుండగా డైహార్ట్ ఫ్యాన్ ఒకరు కాళ్లు మొక్కేందుకు వచ్చారు. ఈ సందర్బంగా అభిమానిని ఆపి అతని కాళ్లకు కూడా తిరిగి నమస్కరించారు. అలాగే తన ఫ్యాన్స్ తల్లి ఫొటోను గుండెలపై పచ్చబొట్టు వేయించుకోవడం పట్ల అభినందించారు. అమ్మకు తన గుండెపై గుడికట్టినందుకు జీవితాంతం గుర్తుండిపోయేలా ముద్దుపెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  అభిమానికి ఇంతకంటే ఇంకేం కావాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

‘జిగర్ తండా’ ప్రీ రిలీజ్ వేడుకలోనే ట్రైలర్ ను కూడా లాంఛ్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. నవంబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!