వెంకీ 75వ సినిమాకి భారీ ఏర్పాట్లు.. దర్శకుడు ఆయనే!

Published : Aug 20, 2020, 07:52 PM ISTUpdated : Aug 20, 2020, 07:54 PM IST
వెంకీ 75వ సినిమాకి భారీ ఏర్పాట్లు.. దర్శకుడు ఆయనే!

సారాంశం

ఈ సినిమాకి దర్శకుడెవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. నిజానికి వెంకీ హీరోగా రెండేళ్ళ క్రితమే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా రావాల్సి ఉంది.

విక్టరీ వెంకటేష్‌ ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. `ఎఫ్‌2` వెంకీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత నటించిన `వెంకీమామ` సైతం ఫర్వాలేదనిపించింది. కానీ వెంకీకి మాత్రం `వెంకీమామ` అనే ట్యాగ్‌ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వెంకటేష్‌ `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొంది బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `అసురన్‌`కి రీమేక్‌. 

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న `నారప్ప` వెంకటేష్‌కి 74వ సినిమా. ఇక తన కెరీర్‌లో మైలురాయిలాంటి 75వ సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించారు. వెంకీ అన్నయ్య, నిర్మాత సురేష్‌బాబు 75వ సినిమాని భారీగా తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నారు. బడ్జెట్‌ వైజ్‌గానూ భారీగా ఉండాలని చూస్తున్నారు. వెంకీ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చేసి చాలా రోజులవుతుంది. ఇటీవల కాలంలో ఆయన పూర్తి స్థాయి మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేయలేదు. దీంతో 75వ చిత్రాన్ని మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నారట. 

అయితే ఈ సినిమాకి దర్శకుడెవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. నిజానికి వెంకీ హీరోగా రెండేళ్ళ క్రితమే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా రావాల్సి ఉంది. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్‌ ఈ సినిమాని అధికారికంగానూ ప్రకటించింది. కానీ అనుకోకుండా ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఓ వైపు వెంకీ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా కావడం, మరోవైపు త్రివిక్రమ్‌ సైతం వేరే హీరోలతో సినిమాలు చేయడంతో ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళింది.

కానీ ఇప్పుడు  వెంకీ ప్రతిష్టాత్మక చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తారని తెలుస్తుంది. ఈ మేరకు ఆయనతో చర్చలు జరిగినట్టు సమాచారం. అన్ని కుదిరితే `నారప్ప` షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుందని టాక్. మరోవైపు త్రివిక్రమ్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్‌ నటిస్తున్న `ఆర్ ఆర్‌ ఆర్‌` పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌ సినిమా ఉండనుంది. ఈ లెక్కన అది షూటింగ్‌ స్టార్ట్ కావడానికి చాలా టైమ్‌ పడుతుంది. ఈ లోపు వెంకీతో సినిమా చేయాలని మాటల మాంత్రికుడు కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే రామ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లోనూ ఓ సినిమాకు చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు