బాలు హెల్త్ అప్‌డేట్‌ః ఇంకా విషమంగానే

By Aithagoni RajuFirst Published Aug 20, 2020, 6:36 PM IST
Highlights

నాన్నగారి ఆరోగ్యం ఇంకా ఆందోళన కరంగానే ఉంది. ఎలాంటి పురోగతి లేదు. అందుకే నేను తరచూ అప్‌డేట్‌ ఇవ్వడం లేదు. అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తాయన్న నమ్మకం ఉంది. 

`నాన్న కోలుకుంటారనే ఆశలు ఇంకా ఉన్నాయి. ఆయన బతుకుతారని బలంగా నమ్ముతున్నాం` అని గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఓ వీడియోని పంచుకున్నారు. 

కొన్ని రోజులుగా బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది. తాజాగా ఎక్మో (Extracorporeal membrane oxygenation) సపోర్ట్‌తో శ్వాస అందిస్తున్నట్టుగా వైద్యులు వెల్లడించారు. చివరి ప్రయత్నంగా ఆయనకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. 

బాలు ఆరోగ్యంపై గురువారం వైద్యులు స్పందించారు. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని తెలిపారు. ఆయన వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని వైద్యులు తమ బులిటెన్‌లో తెలిపారు. కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని, ఆయనకోసం ప్రత్యేకంగా విదేశీ వైద్యుల సూచనలతో ఎక్మో పరికరాలతో వైద్యం చేస్తున్నామన్నారు. ఆయన కోలుకునే అవకాశం ఉందన్నారు. 

ఈ నేపథ్యంతో తాజాగా బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ వీడియోని పంచుకున్నారు. `నాన్నగారి ఆరోగ్యం ఇంకా ఆందోళన కరంగానే ఉంది. ఎలాంటి పురోగతి లేదు. అందుకే నేను తరచూ అప్‌డేట్‌ ఇవ్వడం లేదు. అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తాయన్న నమ్మకం ఉంది. నాన్న ఆరోగ్యం కుదుటపడాలని సామూహిక ప్రార్థనలు చేస్తున్న చిత్ర పరిశ్రమకు మ్యూజిక్‌ డిపార్ట్ మెంట్‌కి, దేశ ప్రజలకు ధన్యవాదాలు. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానులకు థ్యాంక్స్` అని భావోద్వేగభరితంగా తెలిపారు. ఆయన మాట్లాడుతున్న విధానం ప్రకారం బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమంగానే ఉందని అర్థమవుతుంది. 

click me!