
ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు బిగ్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. వెంకట్ ప్రభు,దళపతి విజయ్ కాంబినేషన్ లో చిత్రం గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఆ న్యూస్ నిజమైంది. వెంకట్ ప్రభు, విజయ్ మూవీకి అధికారిక ప్రకటన వచ్చేసింది.
దళపతి 68గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుని ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. వెంకట్ ప్రభు వైవిధ్యమైన యాక్షన్ కథని పకడ్బందీగా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంతో దళపతి విజయ్ తో సినిమా చేయాలనే తన కల నెరవేరబోతోంది అని వెంకట్ ప్రభు పేర్కొన్నారు.
ఒక ఫజిల్ ని నింపుతున్న తరహాలో ఈ చిత్రాన్ని క్రేజీగా ప్రకటించారు. వీడియో ప్రకటన ద్వారా విజయ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
లియో షూటింగ్ ఓ కొలిక్కి రాగానే వెంకట్ ప్రభు మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా వెంకట్ ప్రభు రీసెంట్ గా నాగచైతన్య కస్టడీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.