మంచు మనోజ్ మంచి మనసు, అనాథ ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు

Published : May 21, 2023, 03:33 PM IST
మంచు మనోజ్ మంచి మనసు, అనాథ ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు

సారాంశం

మంచు మనోజ్  ఎప్పటికప్పుడు తన మంచి మనసు చాటుకుంటూనే ఉన్నాడు. మంచు మనోజ్. మంచు వారి ఫ్యామిలీలో కాస్త ట్రోలింగ్ కు గురి కాకుండా.. ఉన్నది మనోజ్ మాత్రమే. ఆయన చేసే పనులు కూడా.. నలుగురు మెచ్చుకునేలా ఉంటున్నాయి. 

మంచు వారింట కాస్త డిఫరెంట్ గా ఉంటాడు మంచు మనోజ్.   ఏం చేసినా.. డిఫరెంట్ గా చేస్తాడు. తాజాగా భూమా మౌనికను ప్రేమించి పెళ్ళాడాడు మనోజు. ఎవరు కాదన్నా.. తనకు అనుకున్నది సాధించి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. గతంలో పెళ్లి చేసుకున్నా.. ఎక్కువ కాలం కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్న మంచు మనోజ్.. అటు మౌనిక కూడా పెళ్లి , విడాకుల తరువాత  ఇద్దరు ప్రమ బంధంతో ఒక్కటయ్యారు. మంచు మనోజ్ ఏ పని చేసినా.. కాస్త డిఫరెంట్ గా చేస్తాడు. మంచువారిలా.. ట్రోలింగ్ కు గురికాకుండా జాగ్రత్త పడతాడు. ఈక్రమంలో తాజాగా ఆయన చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. 

సినిమాలు లేకపోయినా.. లైమ్ లైట్ లోనే ఉంటున్నాడు  మంచు మనోజ్..ఆయన  తన పుట్టిన రోజును అనాథ పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. బర్త్ డే సందర్భంగా గాజుల రామారంలోని కేర్ అండ్ లవ్ ఆశ్రమానికి వెళ్లిన మనోజ్.. అక్కడి పిల్లలతో కలిసి సందడి చేశారు. పిల్లల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి ఆడిపాడుతూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారికి నోట్ పుస్తకాలు, బొమ్మలు, బ్యాగ్ లు, స్వీట్లు పంచిపెట్టారు.

ఇక ఇలా చిన్నారుల మధ్య  తన పుట్టిన రోజును వేడుకలా..  సెలబ్రేట్ చేసుకోవడం  నిజంగా ఆనందంగా ఉందన్నారు మనోజ్. ఇక ఇలాంటి అనాథ పిల్లలకోసం ప్రతీ ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.  పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో తాను కూడా  పిల్లలకు మరింత సేవ చేస్తానని మనోజ్ మాటిచ్చారు.  అనాథ పిల్లలతో కలిసి పుట్టిన రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మంచు మనోజ్ పై సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. 

ఇక మరోవైపు, మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా  వాట్ ది ఫిష్ కు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మూవీటీమ్.  ఈ సినిమాలో మనోజ్ రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ కోరుకొండ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుందని

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు