‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్య రావు పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తన తల్లిని తలుచుకుంటూ షేర్ చేసిన వీడియో అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. దీంతో అభిమానులు ఆమెను ఓదార్చుతున్నారు.
కన్నడ బ్యూటీ, ‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్య రావు (Sowmya Rao) బుల్లితెర ప్రేక్షకులకు బాగానే పరిచయం అయ్యింది. తెలుగు ఆడియెన్స్ లో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు సొంతం చేసుకుంటోంది. యాంకరింగ్ స్కిల్స్, అందం, చలాకీతనంతో స్మాల్ స్క్రీన్ పై వెలుగొందే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతూ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తోంది. కానీ ఆమె ఎంతో బాధను అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా సౌమ్యరావు షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తన తల్లిని తలుచుకుంటూ అక్షరూపంలో ఆమె బాధను తెలియజేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చివరిరోజుల్లో తన తల్లి పడ్డ నరకాన్ని వివరించింది సౌమ్యరావు. తన తల్లి లాంటి కష్టం మరే తల్లికి కూడా రాకూడదని భగవంతున్ని కోరుకుంది. సౌమ్యరావు మదర్ క్యాన్సర్ తో చనిపోయారు.
వీడియోలో బెడ్ పై ఉన్న తల్లికి సేవలు చేస్తూ.. తన హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నించింది. కంటికి రెప్పలా చూసుకుంది. అలాగే సుధీర్ఘమైన నోట్ ద్వారా తన బాధను వివరించింది. ‘అది కాదు... అమ్మా.. అంబులెన్స్, డాక్టర్లు, ట్రీట్‌మెంట్, మందులతో నువ్వేంతో బాధను అనువించావు. అది ఒక బాధాకరమైన జ్ఞాపకం. దేవుడు, గుడి, పూజలు, ఉపవాసాలు ఏవీ ఫలించలేదు. అందరూ అమ్మ ఫోటో పోస్ట్ చేసి మాతృదినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే, నాకు మాత్రం చివరి రోజుల్లో నీ బాధే కళ్ళ ముందుకు వస్తుంది. నువ్వే భారమంటూ రాత్రి పగలు పూజలు దేవుడు మా అమ్మ మీద దయచూపలేదు.
అవన్నీ వృథా అయ్యాయి. నీకు చేసిన సేవతో నాకు తృప్తి లేదు. అమ్మ నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్తిగా మిగిలింది. ప్రతిరోజు, ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. నాకోసం మళ్లీ నువ్వు వస్తావని ఎదురుచూస్తున్నాను. నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నా అమ్మా.. లవ్ యూ సోసోసో మచ్‘ అంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ సౌమ్యరావును ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.