నాగ చైతన్య మూవీపై వెంకట్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు తెలుగు రాదు, కానీ

Published : Sep 27, 2022, 02:15 PM IST
నాగ చైతన్య మూవీపై వెంకట్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు తెలుగు రాదు, కానీ

సారాంశం

థాంక్యూ మూవీ పరాజయం తర్వాత ఒక ఆసక్తికర చిత్రాన్ని నాగ చైతన్య ప్రారంభించారు.తమిళ క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు ప్రస్తుతం నటిస్తున్నాడు. హీరో శింబుతో మానాడు చిత్రాన్ని తెరకెక్కించిన వెంకట్ ప్రభు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

థాంక్యూ మూవీ పరాజయం తర్వాత ఒక ఆసక్తికర చిత్రాన్ని నాగ చైతన్య ప్రారంభించారు.తమిళ క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు ప్రస్తుతం నటిస్తున్నాడు. హీరో శింబుతో మానాడు చిత్రాన్ని తెరకెక్కించిన వెంకట్ ప్రభు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీనితో చైతు మూవీపై భారీ అంచానాలు ఉన్నాయి. సోలో పవర్ ఫుల్ హిట్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న చైతూకి ఈ చిత్రంతో కోరిక నెరవేరుతుంది అని అంటున్నారు. 

నాగ చైతన్య మూవీపై వెంకట్ ప్రభు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తెలుగు రాదు అని.. కానీ ఒక తెలుగు సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని చెన్నైలో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో పేర్కొన్నారు. సినిమాకి భాష ముఖ్యం కాదని వెంకట్ ప్రభు అన్నారు. 

మురుగదాస్, ప్రభు దేవా లాంటి దర్శకుడు భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసి విజయం సాధించారు. వాళ్ళకి హిందీ తెలియకపోయినా బాలీవుడ్ లో రాణించారు అని ప్రశంసించారు. 

కాబట్టి భాష అనేది సినిమాకి అడ్డు కాదని తెలిపారు. విజయ్, అజిత్ అంగీకరిస్తే వారితో మల్టీస్టారర్ మూవీ చేయడానికి తాను రెడీ అంటూ వెంకట్ ప్రభు షాకింగ్ కామెంట్స్ చేశారు. 

నాగ చైతన్యతో తెరకెక్కించబోయే చిత్రం థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్నట్లు టాక్. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు బయటకి రానున్నాయి. ఈ మూవీలో నాగ చైతన్యకి జంటగా కృతి శెట్టి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌