అఫీషియల్.. 'ఆదిపురుష్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మ్యాజికల్ జర్నీ అంటున్న డైరెక్టర్

Published : Sep 27, 2022, 01:44 PM IST
అఫీషియల్.. 'ఆదిపురుష్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మ్యాజికల్ జర్నీ అంటున్న డైరెక్టర్

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ ని బాహుబలిగా చూశాం. ఇక శ్రీరామచంద్రుడిగా చూడబోయే తరుణం వచ్చేసింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ ని బాహుబలిగా చూశాం. ఇక శ్రీరామచంద్రుడిగా చూడబోయే తరుణం వచ్చేసింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఆదిపురుష్ టీజర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చేంసింది. 

అక్టోబర్ నుంచి ఆదిపురుష్ ప్రచార కార్యక్రమాలు మొదలవుతాయని ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలు నిజమయ్యాయి. స్వయంగా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ టీజర్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 

'మా మ్యాజికల్ జర్నీ ఆదిపురుష్ కొత్త అనుభూతి అందించేందుకు, ప్రేమ పంచేందుకు మీ సొంతం కానుంది. అక్టోబర్ 2న అయోధ్యలో సరయు నది ఒడ్డున ఆదిపురుష్ టీజర్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నాం అని ట్వీట్ చేశారు. 

ప్రభాస్, కృతి సనన్ లతో ఉన్న పిక్ ని ఓం రౌత్ షేర్ చేశారు. ఆదిపురుష్ చిత్రాన్ని జనవరి 12న రిలిజ్ చేయనున్నట్లు మరోసారి కంఫర్మ్ చేశారు. అక్టోబర్ నుంచి ఆదిపురుష్ టీం భారీ ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ  చిత్రం కోసం ప్రభాస్ ఇండియా మొత్తం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. 

రామాయణం పురాణ గాధతో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ప్రభాస్ శ్రీరాముడి గెటప్ లో ఎలా ఉంటాడో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

దర్శకుడు ఓం రౌత్ కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే 8 నెలల సమయం వెచ్చించారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు సిల్వర్ స్క్రీన్ పై ఆదిపురుష్ చిత్రం ఎలా ఉండబోతోందో అని. ప్రభాస్, కృతి సనన్ మధ్య కెమిస్ట్రీ ఈ మూవీలో ఒక హైలైట్ అంటూ ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ
నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది