`వీరసింహారెడ్డి`ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌, ప్లేస్‌ ఫిక్స్.. బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు స్టార్ట్

Published : Jan 03, 2023, 07:58 PM IST
`వీరసింహారెడ్డి`ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌, ప్లేస్‌ ఫిక్స్.. బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు స్టార్ట్

సారాంశం

బాలకృష్ణ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ఘట్టం దగ్గరికి వచ్చింది. `వీరసింహారెడ్డి` సినిమా ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకి సంబంధించిన అప్‌డేట్లు వచ్చాయి. 

ఈ సంక్రాంతి రసవత్తరంగా ఉండబోతుంది. ఇద్దరు సీనియర్లు పోటీ పడి వస్తున్నారు. ఓ వైపు మెగాస్టార్‌, మరోవైపు నందమూరి నటసింహాం.. బాక్సాఫీసు వద్ద తమ సత్తా చాటేందుకు వస్తున్నారు. తెలుగు ప్రజలకు డబుల్‌ వినోదాన్ని ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరు నటించిన సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి. ఇందులో ముందుగా రాబోతుంది బాలయ్య నటించిన `వీర సింహారెడ్డి`. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్‌ మసాలా యాక్షన్‌, ప్యామిలీ ఎంటర్‌టైనర్‌ జనవరి 12న విడుదల కాబోతుంది. 

శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు దమ్ములేపుతున్నాయి. మేకింగ్‌ వీడియో సైతం ఆకట్టుకుంది. ఇప్పుటికే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. ఆ పునకాలను రెట్టింపు చేసే మరో భారీ సర్‌ప్రైజ్‌ రాబోతుంది. ట్రైలర్‌ని రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతుంది యూనిట్‌. అంతేకాదు భారీ ఈవెంట్‌ని నిర్వహించబోతుంది. ఆ వివరాలను తాజాగా వెల్లడించారు. 

`వీరసింహారెడ్డి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌, ప్లేస్‌ ఫిక్స్ చేశారు. ఈనెల 6న ఒంగోల్‌లోని ఏబీఎం కాలేజ్‌ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని భారీగా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ వెల్లడించింది. మరోవైపు అదే రోజు సాయంత్రం ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్‌ లీక్‌ చేశాడు. ఇప్పుడే వీరసింహారెడ్డి ట్రైలర్‌ చూశా. ఫైర్‌ అని ఎమోజీలు పంచుకుంటూ రచ్చ రచ్చ.. జనవరి 6న ఫైర్‌ ఫైర్‌ ఫైర్‌ అని ట్వీట్‌ చేశారుథమన్‌. దీంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈవెంట్‌కి రెడీ అవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది