చలపతి రావు 11వ రోజు కార్యక్రమంలో నివాళ్లు అర్పించిన బాలకృష్ణ..

Published : Jan 03, 2023, 06:35 PM IST
చలపతి రావు 11వ రోజు కార్యక్రమంలో నివాళ్లు అర్పించిన బాలకృష్ణ..

సారాంశం

ఇటీవల సీనియర్‌ నటుడు చలపతిరావు హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన 11వ రోజు కార్యక్రమంలో చలపతిరావు చిత్రపటానికి నివాళ్లు అర్పించారు బాలకృష్ణ. 

సీనియర్‌ నటుడు చలపతి రావు ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేసిన బాలకృష్ణ.. తాజాగా 11వ రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. చలపతి రావు చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని తన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా చలపతిరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. 

ఇందులో చలపతిరావు తనయుడు, దర్శక, నటుడు రవిబాబు, వారి ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. బాలకృష్ణతో కలిసి వారు ఫోటోలు దిగారు. ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.గతేడాది డిసెంబర్‌ 25న నటుడు చలపతిరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. అర్థరాత్రి ఆయన భోజనం చేశాక కన్నుమూసినట్టు కుమారుడు రవిబాబు వెల్లడించారు. దీంతో టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌ కి గురయ్యింది. ఆయన మృతి పట్ల అంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

టాలీవుడ్‌లో 1200లకుపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు చలపతిరావు. విలన్‌ పాత్రలకు పెట్టింది పేరు. అంతేకాదు తండ్రి  పాత్రలు, కామెడీ పాత్రలు, మొత్తంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. కానీ ఆయనకు నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలే బాగా పేరుతెచ్చాయి. ఇదిలా ఉంటే బాలకృష్ణకి, చలపతిరావుకి మంచి అనుబంధం ఉంది. బాలయ్య నటించిన దాదాపు అన్ని సినిమాల్లో చలపతిరావు నటించేవారు. 

ప్యాక్షన్‌ చిత్రాల్లో మాత్రం చలపతిరావు ఉండాల్సిందే. అలా ఆ మధ్య వచ్చిన `రూలర్‌`, `లయన్‌`, `లెజెండ్‌`, `సింహ`, `అల్లరి పిడుగు`, `ముద్దుల మొగుడు` వంటి పలు సినిమాల్లో నటించారు. బాలకృష్ణకి మరింత దగ్గరయ్యారు. బాలకృష్ణ ప్రస్తుతం `వీరసంహారెడ్డి` చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని ఈ నెల 6న రిలీజ్‌ చేయబోతున్నారు. అదే రోజు ఒంగోల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు