కౌశల్ తరువాతే గీతామాధురి.. అమిత్ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Sep 18, 2018, 12:18 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా కొనసాగుతున్నారు కౌశల్, గీతామాధురి. సీజన్ మొత్తం కౌశల్ ని గీతామాధురి నామినేట్ చేసినప్పటి నుండి ఇద్దరో మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా కొనసాగుతున్నారు కౌశల్, గీతామాధురి. సీజన్ మొత్తం కౌశల్ ని గీతామాధురి నామినేట్ చేసినప్పటి నుండి ఇద్దరో మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.

గీతామాధురి ఎలాంటి కామెంట్స్ చేసినా.. దానికి వ్యతిరేకంగా కౌశల్ మాట్లాడడం వంటివి జరగడంతో ఇద్దరి మధ్య అసలు పొసగడం లేదు. ఆదివారం ఎలిమినేట్ అయిన అమిత్ వెళ్లిపోతూ వెళ్లిపోతూ టాప్ త్రీలో గీతామాధురి, రోల్, సామ్రాట్ లు ఉంటారని చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు బయటకి వచ్చిన అమిత్ బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని ప్రశ్నించగా.. కౌశల్ పేరు చెప్పడం విశేషం. అమిత్ మాట్లాడుతూ.. ''హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత నాకు కౌశల్ ఫాలోయింగ్ గురించి తెలిసింది.

బిగ్ బాస్ విజేతగా ఆయన గెలుస్తాడని అనుకుంటున్నాను. ఆ తరువాత ఛాన్స్ గీతామాధురికి ఉంది'' అంటూ వెల్లడించారు. కౌశల్ ఫోకస్ మొత్తం గేమ్ మీదే ఉండడంతో హౌస్ మేట్స్ తో ఎలాంటి బంధాలు పెట్టుకోలేదు. దీంతో హౌస్ మేట్స్ కి అతడికి మధ్య వ్యతిరేకత ఏర్పడిందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు అమిత్.

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: కౌశల్ ని అప్పుడెందుకు ప్రశ్నించలేదు..? హౌస్ మేట్స్ పై నెటిజన్లు ఫైర్!

బిగ్ బాస్2: పిచ్చా.. కౌశల్ పై తనీష్ కామెంట్స్!

బిగ్ బాస్2: కౌశల్ తో సహా అందరూ నామినేషన్ లో.. హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య రచ్చ..

click me!