‘వీరసింహారెడ్డి’ విజయోత్సవానికి గ్రాండ్ గా ఏర్పాట్లు.. ఎక్కడ? ఎప్పుడు?

By team telugu  |  First Published Jan 21, 2023, 6:31 PM IST

‘వీరసింహారెడ్డి’తో నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrshna) మరో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అభిమానులు, ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు విజయోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. 
 


నందమూరి లేటెస్ట్ బాలకృష్ణ లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా  ఈనెల జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఏర్నేని, రవిశంకర్ భారీ ఎత్తుకున్న నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రిలీజ్ కు ముందుకు సినిమాపై పెంచిన అంచనాలను చాలా మేరకు రీచ్ అయ్యిందనే చెప్పాలి. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందీ చిత్రం. 

‘అఖండ’ తర్వాత బాలయ్యకు భారీ సక్సెస్ ను అందించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. భారీ అంచనాలతో వచ్చి థియేటర్లలో దుమ్ములేపుతోంది. ఇంతటి సక్సెస్ ను అందుకోడంతో ఇటు మేకర్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తాజాగా అప్డేట్ అందించారు. ‘వీరసింహుని విజయోత్సవం’ పేరిట సభ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెషన్ హాల్ లో రేపు (జనవరి 22)  సాయంత్రం ఐదు గంటలకు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈవెంట్ ను సక్సెస్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  

Latest Videos

మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా ‘వీరసింహారెడ్డి’ దుమ్ములేపింది. ఏకంగా నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.104 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. మరీ ముఖ్యంగా యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద కూడా 1 మిలియన్ డాలర్ కలెక్షన్లతో సత్తా చాటింది. ప్రస్తుతం రెండో వారంలోనూ టికెట్లు తెగుతున్నాయి. చాలా కాలం తర్వాత బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సినిమాలోని డైలాగ్స్, యాక్షన్ సీన్స్, మాస్ ఎలిమెంట్స్, డాన్స్, సాంగ్స్, ముఖ్యంగా థమన్ అందించిన బీజీఎం, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, శ్రుతి హాసన్ పెర్ఫామెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో థియేటర్లలో సందడి చేస్తోంది. 

click me!