NBK108 : బాలకృష్ణ - అనిల్ రావిపూడి మూవీ నెక్ట్స్ షెడ్యూల్ అప్డేట్ ఇదే? ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

By team telugu  |  First Published Jan 21, 2023, 5:54 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. దీంతో నెక్ట్స్ షెడ్యూల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.
 


‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’తో బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకున్న నందమూరి బాలకృష్ణ (Balakrishna) తన తదుపరి చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎన్బీకే108’గా వర్క్ టైటిల్ తో సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావులు ముఖ్య అతిథులు గా విచ్చేయగా 2022 డిసెంబర్ 8న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా  ప్రారంభమైంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. 

ఇక ‘ఎన్బీకే 108’ రెగ్యూలర్ షూటింగ్ ను కూడా అదే రోజు నుంచి ప్రారంభించారు. తొలి షెడ్యూల్ వి వెంకట్ మాస్టర్  యాక్షన్ కొరియోగ్రఫీతో ప్రారంభమైంది. ఫైట్ సీక్వెన్స్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ నిర్మించిన భారీ సెట్ లో ఇప్పటి వరకు షూటింగ్ జరిగింది. ఇక త్వరలో సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే కీలక షెడ్యూల్ పూర్తవ్వగా సెకండ్ షెడ్యూల్ పై తాజాగా క్రేజీ బజ్ వినిపిస్తోంది. 

Latest Videos

సెకండ్ షెడ్యూల్ ను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ హైదరాబాల్ లోనూ ఉంటుందని టాక్. ఇక ఈ షెడ్యూల్ లోనూ యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరించనున్నారని సమాచారం. అలాగే బాలయ్యతో పాటు సినిమాలోని స్టార్ కాస్ట్ తోనూ ప్రధాన సన్నివేశాలను షూట్ చేయనున్నారంట. దాదాపు నెలరోజులకు పైగా నెక్ట్స్ షెడ్యూల్ కొనసాగుతుందని అంటున్నారు. ఈ స్పీడ్ చూస్తుంటే అతి తర్వలోనే సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కానున్నట్టు కనిపిస్తోంది. 

బాలకృష్ణను అనిల్ రావిపూడి ఓ కొత్త లుక్‌ లో ప్రజెంట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన కామెడీకి యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ జోడించి, పవర్ ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ పేరు వినిపిస్తోంది. కూతురి పాత్రలో శ్రీలీలా కనిపించనుందంట. మరోవైపు సీనియర్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏ హీరోయిన్ కు ఛాన్స్ దక్కుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తుండటం విశేషం.

click me!