ట్రైలర్: వీర బోగ వసంత రాయలు.. మినీ మల్టీస్టారర్!

Published : Oct 15, 2018, 08:56 PM ISTUpdated : Oct 15, 2018, 08:57 PM IST
ట్రైలర్: వీర బోగ వసంత రాయలు..  మినీ మల్టీస్టారర్!

సారాంశం

ప్రస్తుతం డిఫరెంట్ కథలతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ కథలు కూడా బాగానే వస్తున్నాయి. ఒకప్పుడు బడ్జెట్ గురించి, కథానాయకుల స్టార్ డమ్ గురించి ఇబ్బంది పడే దర్శకనిర్మాతలు కాన్సెప్ట్ ను నమ్ముకొని అడుగులువేస్తున్నారు.

ప్రస్తుతం డిఫరెంట్ కథలతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ కథలు కూడా బాగానే వస్తున్నాయి. ఒకప్పుడు బడ్జెట్ గురించి, కథానాయకుల స్టార్ డమ్ గురించి ఇబ్బంది పడే దర్శకనిర్మాతలు కాన్సెప్ట్ ను నమ్ముకొని అడుగులువేస్తున్నారు. స్టార్ హీరోలు అందరూ ఈ దారిలో నడవడం లేదు గాని చిన్న హీరోలు మాత్రం మల్టీస్టారర్ కథలనగానే ఒకే చేస్తున్నారు. 

నారా రోహిత్ - సుదీర్ బాబు - శ్రీ విష్ణు.. ఈ ముగ్గురు కథానాయకులు వారికంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు వీరు కలిసి నటించిన చిత్రం వీర బోగ వసంత రాయ;లు. శ్రియా కూడా ఒక ముఖ్య పాత్రలో నటించింది. సినిమాకు సంబందించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది. క్రైమ్ థ్రిల్లర్ వంటి అంశంతో సినిమాను తెరక్కించారు. . 

సుదీర్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వలేదని అర్ధమవుతోంది. ఇక ఎప్పటిలానే డిఫరెంట్ క్యారెక్టర్ తో నారా రోహిత్ ఆకట్టుకుంటున్నాడు. శ్రీ విష్ణు పాత్ర కూడా సినిమాలో హైలెట్ గా ఉంటుందని టాక్. మెయిన్ గా ట్విస్ట్ హైలెట్ పాయింట్ అని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాబా క్రియేషన్స్ పై అప్పారావ్ నిర్మించారు. అక్టోబర్ 26న సినిమాను విడుదల చేయనున్నారు.

 

                                                                     

PREV
click me!

Recommended Stories

Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?
NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ