బాలయ్య - బోయపాటి.. అంతా సిద్ధంగా ఉంది!

Published : Oct 15, 2018, 07:29 PM IST
బాలయ్య - బోయపాటి.. అంతా సిద్ధంగా ఉంది!

సారాంశం

సింహా - లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి.

సింహా - లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. అయితే నెక్స్ట్ వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. 

ఆ సినిమా పాలిటిక్స్ తో పాటు సమాజంలో ఉన్న కొన్ని సమస్యలను, ఇబ్బందులను ఆధారంగా చేసుకొని తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథలో కొన్ని మార్పులు చేసేందుకు రచయిత ఏఎమ్.రత్నం బిజీగా ఉన్నారట. ఎప్పటికప్పుడు దర్శకుడు బోయపాటి సలహాలను తీసుకొని ఆయన స్క్రీన్ ప్లే లో మార్పులు చేస్తున్నారట. దాదాపు కథ మొత్తం సిద్ధమైంది. 

ఒక్కసారి బాలయ్యతో కూర్చొని దర్శకుడు పూర్తి కథ వినిపిస్తే షెడ్యూల్స్ సెట్ చేసుకోవడమే నెక్స్ట్ స్టెప్. అయితే ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. ఇక బోయపాటి కూడా ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో ఇద్దరు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే వారి మూడవ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?