బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు గర్ల్స్ లో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. ఈ క్రమంలో ఓ సీనియర్ నటుడి కూతురు కూడా షాహిద్ ను చాలా అభిమానించేందంట. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. కేరీర్ ప్రారంభం షాహిద్ కపూర్ చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటన, డాన్స్, హ్యాండ్సమ్ లుక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరుగుతూ వచ్చింది. ఇటు సోషల్ మీడియాలోనూ బాలీవుడ్ స్టార్ అంతా ఇంతా ఉండదు. అయితే షాహిద్ కపూర్ కు సంబంధంచిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది.
హీరోలకు లేడీ ఫాలోయింగ్ ఉండటం సర్వసాధారణం. కానీ కొందరు అభిమానులు మాత్రం ఎంతలా ఇష్టపడుతారంటే మాటల్లో చెప్పడం కష్టమే. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. ‘ఇష్క్ విష్క్’ సినిమా తర్వాత షాహిద్ కపూర్ కు బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్ కుమార్ పెద్ద కూతురు వాస్తవిక్త (Vastavikta) వీరాభిమానిగా మారిందంట. తొలిసారిగా పండిట్ షియామక్ దావర్ డ్యాన్స్ క్లాస్‌లలో తొలిసారిగా షాహిద్ ను కలిసిందంట. అయితే అప్పటికే షాహిద్ కు అభిమానిగా మారడంతో పాటు మొదటి చూపులోనే ప్రేమలోనూ పడిందంట.
అప్పటి నుంచి షాహిద్ ను ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండేదంట వాస్తవిక్త. కానీ షాహిద్ మాత్రం ఆమె భావాలకు స్పందించకపోయేవారంట. అయినా ఆమె మాత్రం ఫాలో అవుతూ ఉండటం.. సినిమా సెట్స్‌లోకూ రావడం.. కారు బానెట్‌పై కూర్చోవడం.. అవుట్‌డోర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా కలిసేందుకు ప్రయత్నించడం వంటికి షాహిద్ కు చిరాకు తెప్పించాయంట. అదీగాక షాహిద్ కపూర్ ఇంటిపక్క ఇంట్లోకి చేరి.. తను షాహిద్ కపూర్ భార్యనంటూ చుట్టుపక్కల వారితోనూ చెప్పుకుందంట. ఇది తెలుసుకున్న షాహిద్ ఇక పోలీసులను ఆశ్రయించక తప్పలేదంట. దీంతో వాస్తవిక్తపై కేసు నమోదు చేశాడంట. అయితే ఇదంతా 11 ఏండ్ల కింద జరిగిన ఘటన. ప్రస్తుతం బాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఇక షాహిద్ చివరిగా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఫార్జీ’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు.