వరుణ్‌ తేజ్‌ కూడా అనౌన్స్ చేశాడు..`గని` వచ్చేది ఆ పండక్కే

Published : Aug 05, 2021, 06:32 PM IST
వరుణ్‌ తేజ్‌ కూడా అనౌన్స్ చేశాడు..`గని` వచ్చేది ఆ పండక్కే

సారాంశం

వరుణ్‌ తేజ్‌ కూడా రంగంలోకి దిగుతున్నాడు. ఆయన దీపావళి టార్గెట్‌గా రాబోతున్నట్టు ప్రకటించారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో `గని` పేరుతో ఓ సినిమా రూపొందుతుంది. 

టాలీవుడ్‌లో సినిమా పండుగ ప్రారంభమవుతుంది. థియేటర్లు ఓపెన్‌ కావడంతో ఒక్కొక్క సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే `ఆర్‌ఆర్‌ఆర్‌`, `సర్కారు వారి పాట`, `పుష్ప`, `పవన్‌-రానా`, `రాధేశ్యామ్‌` వంటి చిత్రాల విడుదల తేదీలను కన్ఫమ్‌ చేశాయి. తాజాగా వరుణ్‌ తేజ్‌ కూడా రంగంలోకి దిగుతున్నాడు. ఆయన దీపావళి టార్గెట్‌గా రాబోతున్నట్టు ప్రకటించారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో `గని` పేరుతో ఓ సినిమా రూపొందుతుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. 

అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి సినిమాని థియేటర్లలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.  నిర్మాతలు మాట్లాడుతూ, `ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో చివరి షెడ్యూల్‌ జరుగుతుంది. ఈ చిత్రం కోసం వరుణ్‌ తేజ్‌ పూర్తిగా తన బాడీ లాంగ్వేజ్‌ మార్చుకున్నారు. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు హాలీవుడ్‌ చిత్రం `టైటాన్స్‌`, బాలీవుడ్‌ `సుల్తాన్‌` చిత్రాలకు యాక్షన్‌ సన్నివేశాలను డిజైన్‌ చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ లార్నెల్‌ స్టోవల్‌, వ్లాడ్‌ రింబర్గ్‌ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నార`ని తెలిపారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్