అపార్ట్ మెంట్‌లో వివాదం.. స్పందించిన నిహారిక భర్త చైతన్య..

Published : Aug 05, 2021, 06:05 PM IST
అపార్ట్ మెంట్‌లో వివాదం.. స్పందించిన నిహారిక భర్త చైతన్య..

సారాంశం

అపార్ట్ మెంట్‌లో గొడవ గురించి తనపై మీడియా సంస్థల్లో వస్తోన్న వార్తలపై చైతన్య జొన్నలగడ్డ స్పందించారు. తనపై కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయని, కానీ తానే ముందుగా ఫిర్యాదు చేశానని చైతన్య చెప్పారు. 

తన అపార్ట్ మెంట్‌లో జరిగిన వివాదంపై నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించారు. ఆయన ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. తానే ముందుగా పోలీస్‌లకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సోషల్‌ మీడియాలో, మీడియా సంస్థల్లో వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. తనపై కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయని, కానీ తానే ముందుగా ఫిర్యాదు చేశానని చైతన్య చెప్పారు. అపార్ట్‌మెంట్‌లోని దాదాపు ముప్పై మంది వచ్చి తమ డోర్ కొట్టడంతో తానే ఫిర్యాదు చేశానని చెప్పారు.

ఫ్లాట్ ఓనర్‌కు, అపార్ట్‌మెంట్ వాసులకు మధ్య మిస్ కమ్యూనికేషన్‌ వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. ఫ్లాట్‌ను రెంట్‌కు తీసుకున్న పర్పస్ గురించి తాను ఓనర్‌కు తెలియజేశానని, ఆ విషయం అపార్ట్‌మెంట్ వాసులకు తెలియకపోవడం వల్లే గొడవకు వచ్చారని చెప్పారు. ఇరువురు మాట్లాడుకుని చర్చించుకున్నామని తెలిపారు. తాము కమర్షియల్ ఆఫీసుగా వాడుకోవడం మిగతా ఫ్లాట్ వాళ్లకి ఇబ్బందికరంగా ఉందని చెప్పారని, అందుకే తాము ఈనెల 10న ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని చైతన్య వెల్లడించారు.

చైతన్య ఫ్రెండ్స్ తో ప్రతి రోజు రాత్రి మందు తాగుతూ, చిందులేసే వారని, ఇది సహించలేని అపార్ట్ మెంట్‌ వాసులు చైతన్యని నిలదీశారని, దీంతో రెండు రోజుల క్రితం అర్థరాత్రి జరిగిన గొడవలో ఇరు వర్గాల వారికి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలోనే అపార్ట్ మెంట్‌ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత నిహారిక భర్త చైతన్య కూడా వారిపై ఫిర్యాదు చేసినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైతన్య స్పందించి క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఇరు వర్గాల వారికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి రాజీ కుదిర్చినట్టు తెలుస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్