డబ్బుతో వచ్చే ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌.. ఈ సారి డబుల్‌ డోస్‌ రెడీ

Published : Jan 13, 2021, 03:38 PM IST
డబ్బుతో వచ్చే ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌.. ఈ సారి డబుల్‌ డోస్‌ రెడీ

సారాంశం

 వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ రెండు వైపులు గొడుగుని రివర్స్ చేసి అందులో డబ్బు నోట్లతో నవ్వుతూ కనిపిస్తున్నారు. పై నుంచి నోట్లు పడుతుండగా, వాళ్లు గొడుల్లో పట్టుకుంటున్నట్టుగా ఉన్న ఈ నయా పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

రెండేళ్ల క్రితం వచ్చిన `ఎఫ్‌2` సూపర్‌ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలై, ఊహించని విధంగా వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటిస్తుండగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్‌రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా సంక్రాంతి విషెస్‌ తెలియజేస్తూ ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. 

ఇందులో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ రెండు వైపులు గొడుగుని రివర్స్ చేసి అందులో డబ్బు నోట్లతో నవ్వుతూ కనిపిస్తున్నారు. పై నుంచి నోట్లు పడుతుండగా, వాళ్లు గొడుల్లో పట్టుకుంటున్నట్టుగా ఉన్న ఈ నయా పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా డబ్బు ప్రధానంగా సాగుతున్నట్టు తెలుస్తుంది. డబ్బుతో వచ్చే ఇబ్బందులు, దాని వల్ల పుట్టే కామెడీ ప్రధానంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. అందుకు తగ్గట్టే కొత్త పోస్టర్‌ని డిజైన్‌ చేయడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్‌ అవుతుంది. ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ డబుల్‌ డోస్‌ అనేలా ఉంటుందట ఈ సినిమా. 

ఇప్పటికే వెంకటేష్‌ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనగా, ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వరుణ్‌తేజ్‌ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. షూటింగ్‌ ఫన్నీగా సాగిందని తెలిపిన విషయం తెలిసిందే. ఈ కొత్త పోస్టర్‌ని వరుణ్‌ తేజ్‌, దర్శకుడు అనిల్‌రావిపూడి, చిత్ర నిర్మాత పంచుకున్నారు. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు