అనసూయ మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మూవీలో అనసూయ నటిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ పై ఆమె సైన్ చేసినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి ఇదే నిజమైతే అనసూయకు లక్ చిక్కినట్లే. టాలీవుడ్, కోలీవుడ్ లో అడుగుపెట్టిన అనసూయ ఈ మూవీతో మాలీవుడ్ లో కూడా అడుగుపెట్టినట్లు అవుతుంది.
యాంకర్ అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. స్టార్ యాంకర్ గా అనేక బుల్లితెర ప్రోగ్రామ్స్ హోస్ట్ చేస్తూనే, వరుస సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అధికారికంగా అందరికీ తెలిసి అనసూయ చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. థాంక్ యూ బ్రదర్ అనే వెబ్ మూవీ చేస్తున్న అనసూయ, దర్శకుడు కృష్ణ వంశీతో రంగమార్తాండ మూవీ చేస్తున్నారు. అలాగే సిల్క్ స్మిత బయోపిక్ లో ఆమె ప్రధాన పాత్ర చేస్తున్నారు. వీటితో పాటు తమిళంలో విజయ్ సేతుపతి మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు.
తాజాగా అనసూయ మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మూవీలో అనసూయ నటిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ పై ఆమె సైన్ చేసినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి ఇదే నిజమైతే అనసూయకు లక్ చిక్కినట్లే. టాలీవుడ్, కోలీవుడ్ లో అడుగుపెట్టిన అనసూయ ఈ మూవీతో మాలీవుడ్ లో కూడా అడుగుపెట్టినట్లు అవుతుంది.
గతంలో అనసూయ మమ్ముట్టితో కలిసి నటించారు. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర మూవీలో అనసూయ హీరో మమ్ముట్టితో కలిసి కొన్ని సన్నివేశాలలో కనిపించారు. మరి ప్రచారం నిజమైతే మమ్ముట్టితో అనసూయ చేస్తున్న రెండో చిత్రం అవుతుంది. ఇక ఎప్పుడూ షూటింగ్స్, ఈవెంట్స్ , ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉండే అనసూయ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.