Operation Valentine Teaser : వరుణ్ తేజ్ ఎయిరియల్ యాక్షన్.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ విడుదల

Published : Dec 18, 2023, 05:28 PM IST
Operation Valentine Teaser : వరుణ్ తేజ్ ఎయిరియల్ యాక్షన్.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ విడుదల

సారాంశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నెక్ట్స్ ఫిల్మ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ చిత్ర టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. దేశం కోసం తన జీవితాన్ని రిస్క్ చేసిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  మరియు మానుషీ చిల్లర్ (Manushi Chhillar) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). దేశం కోసం ఫైలట్ గా సాహసాలు చేయబోతున్నారు. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీలో బైలింగ్వువల్ గా తెరకెక్కుతోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్దా, సహ-నిర్మాతలు నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా వరుసగా అప్డేట్స్ ను అందించేందుకు రెడీ అయ్యారు. తాజాగా మేకర్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ స్ట్రైక్ పేరిట మొదటి అప్డేట్ ఇచ్చారు. Operation Valentine Teaser ను విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. పైలట్ గా వరుణ్ తేజ్ చేసే ఎయిర్ యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. 

గతంలో వరుణ్ తేజ్ చేసిన ‘అంతరిక్షం’ సినిమాను గుర్తు చేసేలా టీజర్ కనిపిస్తోంది. ఆ మూవీ అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఎయిరియల్ యాక్షన్ తో మరోసారి అలరించబోతున్నారు. విజువల్స్ చాలా గ్రాండియర్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ సీన్లు కూడా అబ్బుపరిచేలా ఉన్నాయి. బీజీఎం కూడా ఆకట్టుకుంటోంది. టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 16, 2024న విడుదల కాబోతోంది. వరుణ్ తేజ్ - లావణ్యలపెళ్లి తర్వాత రాబోతున్న సినిమా కావడం ఆసక్తికరంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా