Salaar Trailer 2: అసలైన `సలార్‌` దిగాడు.. ప్రభాస్‌ ఫ్యాన్స్ కోరుకున్నది ఇదేగా.. విరోచితంగా సెకండ్‌ ట్రైలర్‌..

Published : Dec 18, 2023, 04:01 PM ISTUpdated : Dec 18, 2023, 04:17 PM IST
Salaar Trailer 2: అసలైన `సలార్‌` దిగాడు.. ప్రభాస్‌ ఫ్యాన్స్ కోరుకున్నది ఇదేగా.. విరోచితంగా సెకండ్‌ ట్రైలర్‌..

సారాంశం

`సలార్‌` నుంచి రిలీజ్‌ ట్రైలర్‌ వచ్చింది.   ప్రభాస్‌ని హైలైట్‌గా చూపిస్తూ, ఆయన హీరోయిజాన్ని హైలైట్‌ చేస్తూ, ఆయన విరోచితమైన యాక్షన్‌ని చూపించేలా ఈ ట్రైలర్‌ సాంగింది.

ప్రభాస్‌ నటిస్తున్న `సలార్‌` చిత్రం నుంచి మరో ట్రైలర్‌ వచ్చేసింది. మొదటి `సలార్‌` ట్రైలర్‌ డిజప్పాయింట్‌ చేసిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టింది యూనిట్‌. సినిమాపై హైప్‌ తెచ్చేందుకు ప్రభాస్‌ ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు ఇప్పుడు రిలీజ్‌ ట్రైలర్‌ పేరుతో మరో ట్రైలర్‌ని విడుదల చేసింది. రెండు సార్లు వాయిదా పడిన ఈ ట్రైలర్‌ ఎట్టకేలకు మధ్యాహ్నం మూడున్నర తర్వాత విడుదల చేశారు. 

ఇందులో ప్రభాస్‌ని హైలైట్‌గా చూపిస్తూ, ఆయన హీరోయిజాన్ని హైలైట్‌ చేస్తూ, ఆయన విరోచితమైన యాక్షన్‌ని చూపించేలా ఈ ట్రైలర్‌ సాంగింది. సుల్తాన్‌ తనకు సమస్య వస్తే తన బలమైన పెద్ద సైన్యం ఉన్నా, ఆ విషయం సైన్యానికి చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. అతను సల్తాన్‌ కావాలనుకున్నది ఏదైనా తెచ్చి ఇచ్చేవాడని, వద్దనుకున్నది ఏదీ మిగిల్చేవాడు కాదని బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌తో ప్రభాస్‌ పాత్రని ఎలివేట్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక `కేజీఎఫ్‌`కి పది రెట్లు హింస, యాక్షన్‌ ఉంటుందనేలా ఇందులో యాక్షన్‌ సన్నివేశాలుసాగాయి. 

మొదటి ట్రైలర్‌ని మిస్‌ అయ్యింది, ప్రభాస్‌ ఫ్యాన్స్ కోరుకున్నది ఇదేనా అనేలా ఈ ట్రైలర్‌ సాగడం విశేషం. ఆద్యంతం గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. సినిమాపై అంచనాలు పెంచింది. మొదటి ట్రైలర్‌లో ప్రభాస్‌ పెద్దగా లేడనే అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఇందులో ప్రభాస్‌ని చూపించిన తీరు వాహ్‌ అనేలా ఉంది. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారడం వల్ల ఖాన్‌సార్‌ సామ్రాజ్యం ఎలా మారిపోయింది, వారి జీవితాలు ఎలా మారాయి అనేది ఈ చిత్ర కథాంశంగా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఇందులోనూ ప్రభాస్‌కి ఇందులో రెండు డైలాగ్‌ లు ఉన్నాయి. అందులో తుపాకీ కాల్చుతూ `అంతేగా` అని చెప్పడం హైలైట్‌గా  ఈ మాత్రం చాలు అనేలా ఉండటం విశేషం. 

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ స్నేహితులుగా నటిస్తున్నారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా చేస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. డిసెంబర్‌ 22న  ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?