Tollywood Updates : ‘ఆపరేషన్ వాలెంటైన్స్’ నుంచి ఎమోషనల్ సాంగ్.. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ హీరోయిన్ కబుర్లు

By Nuthi Srikanth  |  First Published Feb 26, 2024, 11:04 PM IST

టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రాల నుంచి ఈరోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి. వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చిత్రాల నుంచి ఈ అప్డేట్స్ వచ్చాయి. 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  మరియు మానుషీ చిల్లర్ (Manushi Chhillar) జంటగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీలో బైలింగ్వువల్ గా తెరకెక్కుతోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్దా, సహ-నిర్మాతలు నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 1న చిత్రం విడుదల కాబోతోంది. నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగ్గా... ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్రం నుంచి ‘అన్నీ నువ్వే అమ్మకు’ అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. 

Latest Videos

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ హీరోయిన్ రాశీ సింగ్ కామెంట్స్.... 

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ (Bhoothaddam bhaskar narayana).  స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రంలో హీరోయిన్ గా నటించిన రాశి సింగ్ (Raashi Singh) విలేకరుల సమావేశంలో భూతద్ధం భాస్కర్ నారాయణ విశేషాలను పంచుకున్నారు. 

ఆమె మాట్లాడుతూ.. మాది రాయ్ పూర్. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాను. పరిశ్రమలోకి వచ్చే ముందు ఏడాది కాలం పాటు ఎయిర్ హోస్టెస్ గా ఉదోగ్యం చేశాను. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉంది. ఇప్పటి వరకు సంతోష్ శోభన్ తో ప్రేమ్ కుమార్, ఆహాలో పాపం పసివాడు సినిమాలు చేశాను. ఇప్పుడు శివ కందుకూరితో భూతద్ధం భాస్కర్ నారాయణలో నటించాను. ఇందులో నా పాత్ర పేరు లక్ష్మీ, చాలా నేచురల్ గా వుంటుంది. ఇందులో సస్పెన్స్ థ్రిల్ రోమాన్స్ పాటలు అన్నీ వున్నాయి. రిపోర్టర్ గా కనిపిస్తాను. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది. ఇక పురుషోత్తం రాజ్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. ఇక నాకు వైవిధ్యమైన పాత్రలు చేయాలని వుంటుంది. టాలీవుడ్ లో అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం. నేను నెక్ట్స్ సుహాస్ తో చేసిన ‘ప్రసన్న వదనం’ త్వరలో  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

click me!