రియల్‌ ఇన్సిడెంట్స్ తో వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా.. ఎయిర్‌ ఫోర్స్ ఆఫీసర్‌?

Published : Sep 17, 2022, 11:57 AM IST
రియల్‌ ఇన్సిడెంట్స్ తో వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా.. ఎయిర్‌ ఫోర్స్ ఆఫీసర్‌?

సారాంశం

వరుణ్‌ తేజ్‌ రియల్‌ ఇన్సిడెంట్స్ తో సినిమా చేస్తున్నారు.  తాజాగా ఆ విషయాన్ని ప్రకటించారు. ఆయన ట్వీట్ వైరల్‌ అవుతుంది.

వరుణ్‌ తేజ్‌ ఇటీవల `ఎఫ్‌3`తో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్‌ సత్తార్‌ సినిమాలో నటిస్తున్నారు. ఇది వరుణ్‌ తేజ్‌కి 12వ మూవీ. తాజాగా మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు వరుణ్‌ తేజ్‌. ఈ సినిమాని వివరాలు పంచుకుంటూ ఓ వీడియోని విడుదల చేశారు. తన 13వ మూవీకి కమిట్‌ అయినట్టుగా తెలిపారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు తెలిపారు. 

బౌండెడ్‌ స్క్రిప్ట్ ని చదివి సాటిస్ఫై అయిన వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాని ఓకే చేసినట్టుగా ఈ వీడియోలో ఉంది. ఇక దీనికి దర్శకుడెవరు, ప్రొడక్షన్‌ ఎవరు వంటి ఇతర అంశాలతో అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో తెలియజేయనున్నారట. ఈ నెల 19న అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు ఈ వీడియోలో తెలిపారు వరుణ్‌ తేజ్‌. `ఆకాశాన్ని తాకే ఇండియా గ్లోరీ` అనే అర్థంలో వరుణ్‌ తేజ్‌ ఈ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 

వరుణ్‌ తేజ్‌ `ఎఫ్‌3`తో మెప్పించారు. వెంకటేష్‌తో కలిసి నటించిన `ఎఫ్‌3` కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించింది. అంతకు ముందు `గని` చిత్రంతో డిజప్పాయింట్‌ని చవి చూశారు. సోలో హిట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ఆయన ప్రవీణ్‌ సత్తారుతో ఓ సినిమా చేస్తున్నారు. అనంతరం కొత్త సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు