#UnstoppableWithNBK2: బాలయ్య బుల్లితెర విశ్వరూపానికి రంగం సిద్ధం.. `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే2` అఫీషియల్‌

Published : Sep 17, 2022, 06:38 AM ISTUpdated : Sep 17, 2022, 06:41 AM IST
#UnstoppableWithNBK2: బాలయ్య బుల్లితెర విశ్వరూపానికి రంగం సిద్ధం.. `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే2` అఫీషియల్‌

సారాంశం

బాలయ్య మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఆయన హోస్ట్ గా చేసిన `అన్‌స్టాపబుల్‌విత్‌ఎన్బీకే` సీజన్‌ 2కి వేళయ్యింది. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతున్నట్టు నిర్వహకులు ప్రకటించారు.

బాలకృష్ణ వెండితెరపై ఎంట్రీతోనే విశ్వరూపం చూపించారు. ఆయన హోస్ట్ గా చేసిన `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే` టాక్‌ షో దుమ్ములేపింది. ఆహాలో గతేడాది ప్రసారమైన ఈషో అత్యధిక టీఆర్పీతో రికార్డులు క్రియేట్‌ చేసింది. సెలబ్రిటీలతో బాలయ్య ఓపెన్‌గా, బోల్డ్ గా, ఎలాంటి ఫిల్టర్‌ లేకుండా చేసిన కన్వర్జేషన్‌ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ టాక్‌ షోకి అభిమానులు బ్రహ్మారథం పట్టారు. ఇందులో మోహన్‌బాబు, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, బోయపాటి శ్రీను, రవితేజ, రాజమౌళి వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. చివరగా మహేష్‌ పాల్గొన్నారు. 

తాజాగా ఇప్పుడు రెండో సీజన్‌కి టైమ్‌ వచ్చింది. బాలయ్య మరోసారి విశ్వరూపం చూపేందుకు వస్తున్నారు. `అన్‌స్టాపబుల్‌విత్‌ఎన్బీకే2` త్వరలోనే ప్రారంభం కాబోతుంది. తాజాగా `ఆహా` నిర్వహాకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. `త్వరలో ఫెస్టివల్‌ ప్రారంభం కానుంది. దెబ్బకు థింకింగ్‌ మారిపోవాలా` అంటూ పంచుకున్న పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సీజన్‌కి కూడా బాలయ్యనే హోస్ట్ గా ఉండనున్నారు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభం కాబోతుందనేది సస్పెన్స్ నెలకొంది. దసరాకి ఏమైనా ప్రారంభమవుతుందేమో చూడాలి. 

ఇదిలా బాలయ్య తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా చేసిన షో `అన్‌స్టాపబుల్‌విత్‌ఎన్బీకే` అనే విషయం తెలిసిందే. అంతకు ముందు బాలయ్య అంటే ఓ అగ్రెసివ్‌గా ఉండేవారని, కోపం ఎక్కువ అనే టాక్‌ ఉండేది. కానీ అది నిజం కాదని నిరూపించిన షో ఇది. ఆయనలోని మరో షేడ్‌ని బయటకు తీసింది. బాలయ్యలో మంచి ఫన్ యాంగిల్‌ కూడా ఉందని,ఆయన మనస్తత్వం చిన్నపిలాడిలా ఉంటుంద ఆయనలో మరో షేడ్‌ ఉందని ఈ షో నిరూపించింది. అందుకే దీనికి విశేష ఆదరణ దక్కింది. మరి రెండో సీజన్‌ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్