వరుణ్ తేజ్ నెక్ట్స్.. భారీ బడ్జెట్ తో ‘మట్కా’.. ఆసక్తికరంగా టైటిల్ పోస్టర్.. డిటేయిల్స్

By Asianet News  |  First Published Jul 27, 2023, 2:01 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతూ వస్తున్నారు. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటిస్తుండగా.. తాజాగా మరో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. టైటిల్ పోస్టర్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. 
 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  భారీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతూ బిజీ అవుతున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ ఆకట్టుకునేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘గాంఢీవదారి అర్జున’  టైటిల్ తో మూవీ రూపుదిద్దుకుంటోంది. రీసెంట్ గా టీజర్ కూడా  విడుదలై ఆకట్టుకుంటోంది. యాక్షన్ తో మెగా ప్రిన్స్ అదరగొట్టారు.

ఇక వరుణ్ తేజ్ 13వ చిత్రం కూడా రూపుదిద్దుకుంటోంది. ఐఏఎఫ్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో బైలింగువ్వల్ గా రూపుదిద్దుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన 14వ సినిమానూ ప్రకటించారు. కొద్దిసేపటి కింద టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ‘మట్కా‘ (Matka)  టైటిల్ గా సినిమా తెరకెక్కబోతోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని డిటేయిల్స్ కూడా వెల్లడించారు. 

Latest Videos

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM)  , డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ‘మట్కా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ స్కేల్లో రూపుదిద్దుకోనుందని ప్రకటించారు. చిత్రానికి ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నారని, పీరియాడిక్ డ్రామాగా ఉండనుందని తెలుస్తోంది. మట్కాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఓ స్పెషల్ సాంగ్ తోనూ అలరించనుంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. 
 
టైటిల్ పోస్టర్ విషయానికొస్తే.. 70ల నాటి కాలంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. పోస్టర్ లో ఆ సమయాన్ని మరియు వాతావరణాన్ని వర్ణించే వస్తువులను గమనించవచ్చు. ఈ మూవీ కథ 24 ఏళ్లుగా సాగుతుందని తెలుస్తోంది. దాంతో వరుణ్ తేజ్ పాత్రలో వయస్సు వైవిధ్యాన్ని చూపించే అవకాశం ఉంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఓ యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందని అంటుున్నారు. ఏదేమైనా సినిమా టైటిల్ పోస్టర్ తోనే ఆసక్తిని క్రియేట్ చేసింది. 

click me!