
తెలుగు మార్కెట్ పై గట్టిగా కన్నేశారు తమిళ హీరోలు. ఏకంగా డైరెక్ట్ తెలుగుసినిమాలు చేసేస్తున్నారు. ధనుష్, విజయ్, శివకార్తికేయన్ లాంటి హీరోలు ఆల్ రెడీ తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేశారు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో డైరెక్టర్ వెంకీ అట్లూరితో సర్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. ఆరంగేట్రమే.. వంద కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చుకోవడంతో.. నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు ధనుష్.
అసలు ధనుష్ తెలుగులో ముందుగా అనుకున్న దర్శకుడు శేఖర్ కమ్ములనే. కాని ఈ సినిమా ఎందుకు వెనక్కు వెళ్లిపోయి.. ఫోకస్ లోకి వెంకీ అట్లూరి వచ్చాడు. ఇక ఈసినిమా సూపర్ హిట్ తో.. ఇక శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కూడా లైన్ లోకి తీసుకురావాలి అని చూస్తున్నాడట ధనుష్. ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తన సొంత దర్శకత్వంలో ధనుష్ 50వ సినిమా తెరకెక్కనుంది.
ధనుష్ హీరోగా తెలుగులో మంచి క్లాస్ సినిమాలు అందించే దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా గతంలోనే అనౌన్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కానీ ఈ సినిమా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు త్వరలోనే ఈ సినిమాని సెట్స్ ఎక్కించబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్ డేట్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని సమాచారం. ఇప్పటికే నాగార్జున కూడా ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గతంలో నాగార్జున తమిళ హీరో కార్తీ కాంబినేషన్ లో ఊపిరి సినిమా తెరకెక్కింది.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా.. మంచి సినిమాగా నిలబడింది. ఇక ఇప్పుడు ధనుష్ సినిమాలో నాగ్ ఎలాంటి క్యారెక్టర్ తో మెప్పిస్తారో చూడాలి.