`కోయిలమ్మ సీరియల్‌ హీరో సమీర్‌పై లైంగిక వేధింపుల కేసు

Published : Jan 28, 2021, 11:38 AM IST
`కోయిలమ్మ సీరియల్‌ హీరో సమీర్‌పై లైంగిక వేధింపుల కేసు

సారాంశం

`కోయిలమ్మ` సీరియల్‌ ఫేమ్‌ నటుడు సమీర్‌ అలియాస్‌ అమర్‌ పై కేసు నమోదైంది. ఆయనపై గురువారం హైదరాబాద్‌ రాయదుర్గంలోని పోలీస్‌ స్టేషన్‌ లైంగిక వేధింపుల కేసుని నమోదు చేవారు. తాగిన మత్తు మణికొండలో ఒంటరిగా ఉంటున్న ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి దిగాడని వారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

`కోయిలమ్మ` సీరియల్‌ ఫేమ్‌ నటుడు సమీర్‌ అలియాస్‌ అమర్‌ పై కేసు నమోదైంది. ఆయనపై గురువారం హైదరాబాద్‌ రాయదుర్గంలోని పోలీస్‌ స్టేషన్‌ లైంగిక వేధింపుల కేసుని నమోదు చేవారు. తాగిన మత్తు మణికొండలో ఒంటరిగా ఉంటున్న ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి దిగాడని వారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. `తాగిన మత్తులో సమీర్‌ మాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. రాత్రి తొమ్మిది గంటలకు మహిళ ఇంటికెళ్లి దౌర్జన్యం చేసి తమ దగ్గరున్న వస్తువులని లాక్కెళ్లి లైంగిక వేధింపులకు గురి చేశాడని మహిళ ఫిర్యాదు చేసింది. 

దీంతో సమీర్‌తోపాటు ముగ్గురు వ్యక్తులు, ఆయన ప్రియురాలు తమపై దాడి చేశారని బాధితులు పేర్కొన్నారు. శ్రీ విద్య అపర్ణలు కొద్ది రోజులుగా మణికొండలో బొటిక్‌ షాప్‌ని నిర్వహిస్తున్నారు. వారి దగ్గర నుంచి అయిదు లక్షల నగడు తీసుకున్నారు సమీర్‌. అవి అడిగితే రౌడీయిజం చేస్తున్నారని మహిళలు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. తమకి సమీర్‌ నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. దీంతో స్పందించిన పోలీసులు సమీర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. 

బుల్లితెరపై `కోయిలమ్మ` సీరియల్‌ బాగా ఆదరణ పొందుతుంది. ఇది ఇప్పటికే ఎనిమిది వందల ఎపిసోడ్‌ పూర్తి చేసుకుంది. ఈ సీరియల్‌ ద్వారా సమీర్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న సమీర్ తనకు వచ్చిన పాపులారిటీని ఇలా వాడుకుంటున్నాడు అని యువతులు ఆరోపించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఓటీటీలో మీకోసం వీకెండ్‌ లో దుమ్మురేపే 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర