ఫైనల్ రౌండ్ కోసం రక్తం చిందిస్తున్న వరుణ్

Published : Jul 10, 2021, 02:55 PM IST
ఫైనల్ రౌండ్ కోసం రక్తం చిందిస్తున్న వరుణ్

సారాంశం

గని చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. శనివారం మొదలైన చివరి షెడ్యూల్ లో పతాక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక బాక్సింగ్ రింగ్ లో వరుణ్ ప్రత్యర్థులతో తలపడుతూ రక్తం చిందిస్తున్నారు. 

ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ వంటి వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్నారు మెగా హీరో వరుణ్ తేజ్. ఆయన తన తదుపరి చిత్రంగా ఓ స్పోర్ట్స్ డ్రామా ఎంచుకున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నారు. గని అనే మాస్ టైటిల్ ఈ చిత్రానికి ప్రకటించిన విషయం తెలిసిందే. 


కాగా గని చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. శనివారం మొదలైన చివరి షెడ్యూల్ లో పతాక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక బాక్సింగ్ రింగ్ లో వరుణ్ ప్రత్యర్థులతో తలపడుతూ రక్తం చిందిస్తున్నారు. ఇక గని పాత్ర కోసం వరుణ్ చాలా కష్టపడ్డారు. జిమ్ లో కష్టపడి కండలు పెంచిన వరుణ్, ప్రొఫెషనల్ బాక్సర్స్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 


దర్శకుడు కిరణ్ కొర్రపాటి గని చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకట్ తో పాటు సిద్దు ముద్దా కలిసి గని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి కీలక రోల్స్ చేస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా