తిరుమల శ్రీవారిని సేవలో నమిత దంపతులు.. ఇంట్రెస్టింగ్‌ కెరీర్‌ అప్‌డేట్స్..

Published : Jul 10, 2021, 01:55 PM IST
తిరుమల శ్రీవారిని సేవలో నమిత దంపతులు.. ఇంట్రెస్టింగ్‌ కెరీర్‌ అప్‌డేట్స్..

సారాంశం

నటి నమిత దంపతులు శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకోగా, వీరిని అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

తెలుగులో బాలయ్య, వెంకటేష్‌, ప్రభాస్‌ వంటి స్టార్లతో మెరిసిన నమిత తాజాగా తిరుమల శ్రీవారి సేవలో సేద తీరారు. శనివారం నమిత దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకోగా, వీరిని అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాసేపు తిరుమల శ్రీవారి పరిసరాలను ఆస్వాధించారు. నమిత 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

తాను నటించిన `బౌ బౌ` అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. అయితే దాన్ని థియేటర్‌లో రిలీజ్‌ చేయలా? ఓటీటీలో తీసుకురావాలా? అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అంతేకాదు త్వరలోనే ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నట్టు తెలిపింది. ఇప్పటికే తాను ఓటీటీని లాంచ్‌ చేస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. నమితా థియేటర్‌ పేరుతో ఓటీటీని, నమిత ప్రొడక్షన్ ని ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. 

`సొంతం` చిత్రంలో తెలుగులో నటిగా అడుగుపెట్టిన నమిత `జెమినీ` చిత్రంలో వెంకీతో జోడి కట్టింది. రవితేజకు జోడీగా `ఒక రాజు ఒక రాణి` సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత. ప్రభాస్‌తో `బిల్లా` చిత్రంలో నటించి బికినీలో అనుష్కకి పోటీగా అందాల విందు వడ్డించింది. స్కిన్‌ షో విషయంలో ఏమాత్రం తగ్గలేదీ భామ. బాలకృష్ణతో `సింహ`లోనూ హాట్‌ షో చేసింది. ఇలా సెకండ్‌ హీరోయిన్‌గా, వ్యాంప్‌ తరహా పాత్రలతో మెరిసింది. సిల్వర్ స్క్రీన్ పై కాదు.. టీవీ రియాలిటీ షోల్లో జడ్జ్‌గా పలు షోలకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?