'గాండీవధారి అర్జున' టీజర్.. వరుణ్ తేజ్ తగలబెట్టేస్తున్నాడుగా, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్

Published : Jul 24, 2023, 11:42 AM IST
'గాండీవధారి అర్జున' టీజర్.. వరుణ్ తేజ్ తగలబెట్టేస్తున్నాడుగా, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్

సారాంశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'గాండీవధారి అర్జున' ఆగష్టు 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'గాండీవధారి అర్జున' ఆగష్టు 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చూస్తుంటే వరుణ్ తేజ్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ అండ్వెంచర్ చేయబోతున్నట్లు అనిపిస్తోంది. 

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా టీజర్ విడుదలయింది. 1 నిమిషం 10 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. హాలీవుడ్ చిత్రాలని తలపించేలా హై వోల్టేజ్ యాక్షన్ తో వరుణ్ తేజ్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. 

'ఇది ఎమెర్జన్సీ, ఫైల్ 13 మనకి ఎట్టి పరిస్థితుల్లో కావాలి' అనే బ్యాగ్రౌండ్ డైలాగ్స్ తో టీజర్ మొదలవుతుంది. ఈ పనికి నేను అర్జున్ ని మాత్రమే నమ్మగలను అని ఓ ఆఫీసర్ చెబుతాడు. వెంటనే వరుణ్ ఎంట్రీ ఇచ్చి యాక్షన్ బీభత్సం మొదలు పెడతాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సాక్షి వైద్య కూడా యాక్షన్ స్టంట్స్ చేస్తోంది. అతనితో పనిచేయడం కష్టం అంటూ వరుణ్ గురించి చెబుతోంది. 

టీజర్ లో చేజింగ్స్, గన్ ఫైరింగ్స్, ఎక్స్ప్లోజన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. చూస్తున్నది తెలుగు టీజరా లేక హాలీవుడ్ చిత్రమా అనే అనుమానం కలిగేలా అద్భుతంగా ఉంది. మరోసారి డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు యాక్షన్ చిత్రాల్లో తన సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నారు. మిక్కీ జె మేయర్ అందించిన బిజియం పవర్ ఫుల్ గా ఉంది. 

సీక్రెట్ మిషన్ కి ఏజెంట్ వరుణ్ తేజ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరహో అనిపిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే వరుణ్ తేజ్ కి ఇది పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే పాత్ర అనిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కూడా ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అనిపిస్తోంది. నాజర్, విమలా రామన్, రవి వర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?