తాగి సెట్స్ కి వచ్చావా అని పవన్ కళ్యాణ్ అడిగారు- సాయి ధరమ్ తేజ్ 

Published : Jul 24, 2023, 11:39 AM ISTUpdated : Jul 24, 2023, 12:10 PM IST
తాగి సెట్స్ కి వచ్చావా అని పవన్ కళ్యాణ్ అడిగారు- సాయి ధరమ్ తేజ్ 

సారాంశం

మామ అల్లుళ్లు పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

బ్రో మూవీ జులై 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. పొలిటికల్ గా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చిత్ర ప్రమోషన్స్ కో దూరంగా ఉన్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రోమోట్ చేస్తున్నారు. ఆయన తీరిక లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరోయిన్ కేతిక శర్మ సైతం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మామయ్య పవన్ కళ్యాణ్ తో నటించడం గొప్ప అనుభూతి అని చెప్పిన సాయి ధరమ్ తేజ్... కొన్ని సన్నివేశాల్లో ఇబ్బంది పడ్డట్లు వెల్లడించారు. 

బ్రో సినిమాలో కేక్ తినిపించే సన్నివేశం ఒకటి ఉంది. ఆ సీన్ చిత్రీకరణ సమయంలో కొంచెం ఇబ్బందిపడ్డాను. అయితే ఆ సన్నివేశం చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ మామయ్య ముందు మందు తాగే సీన్ ఒకటి ఉంది. అప్పుడు కూడా బాగా ఇబ్బంది భావన కలిగింది. ఆ సీన్ పూర్తయ్యాక ఏరా నిజంగానే తాగొచ్చావా? అని మామయ్య సరదాగా అడిగారని, సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. 

అలాగే ఇటీవల విడుదల చేసిన పోస్టర్లో పవన్ కళ్యాణ్ లుంగీ ఎత్తి కట్టి, నోట్లో బీడీ పెట్టి మాస్ కూలీ గెటప్ లో ఉన్నారు. బ్రో చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్ర చేస్తుండగా... బీడీ తాగడం వివాదాస్పదం కాదా? అని సాయి ధరమ్ తేజ్ ని ఓ ఇంటర్వ్యూలో అడిగారు. దానికి సాయి ధరమ్ చెప్పిన సమాధానం కొంచెం సిల్లీగా ఉంది. అక్కడ దేవుడు కంటే ఒక క్యారెక్టర్ గానే చూడాలి. మనం ప్రకృతిని ఆరాధిస్తాము. బీడీ కూడా ప్రకృతి నుండి వచ్చిందే కదా... కాబట్టి దేవుడు పాత్ర చేసిన పవన్ కళ్యాణ్ ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. లాజిక్స్ వదిలేసి మా ఇద్దరి కాంబోలో వచ్చే సన్నివేశాలు బాగా ఎంజాయ్ చేయండని సాయి ధరమ్ తేజ్ అంటున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు
2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?