భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్’పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓటీటిలో రిలీజ్ అవుతుందా లేదా థియోటర్స్ లో రిలీజ్ అవుతుందా అనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది.
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్ పతాకంపై ‘జిల్’ఫేమ్ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్’పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓటీటిలో రిలీజ్ అవుతుందా లేదా థియోటర్స్ లో రిలీజ్ అవుతుందా అనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. అయితే భారీగా ఓటీటి ఆఫర్ వచ్చినా థియోటర్ వైపే మ్రొగ్గు చూపారని వినపడింది. అయితే థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను విడి విడిగా అమ్మితేనే తాము పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అన్నది నిర్మాతల ఆలోచనగా ఉంది.
ఈ నేపధ్యంలో ట్రేడ్ లో ఓ వార్త సర్కులేట్ అవుతోంది. రాధేశ్యామ్ డిజిటల్, శాటిలైట్ హక్కులను యువి క్రియేషన్స్ సంస్థ భారీ మొత్తానికి అమ్మేసినట్లు సమాచారం. హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని జీ5 స్ట్రీమ్ చేస్తుందిట. అలాగే ఈ చిత్ర శాటిలైట్ హక్కులను సైతం జీ గ్రూప్ సొంతం చేసుకుందని.. వివిధ భాషల్లోని జీ ఛానెళ్లలో ఈ సినిమాను రిలీజ్ అయిన మూడు నెలలకు ప్రసారం చేయనున్నారని తెలుస్తోంది. అయితే డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపి ఎంతకు వెళ్లాయి అనేది మాత్రం బయిటకు రాలేదు. ఓ లెక్క ప్రకారం రూ.200 కోట్ల దాకా ఉండొచ్చని తెలుస్తోంది.
ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస తన కెమెరా పనితనాన్ని చూపెట్టనున్నారు. సచిన్ ఖడేకర్, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీశర్మ, కృనాల్ రాయ్ కపూర్ ఇతర పాత్రల్లో నటిస్తుండగా, కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం! ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండగా.. దసరా సమయానికి పరిస్థితులు బాగుంటే థియేటర్లలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.