పవన్ ఫేక్ స్టార్ .. మహేష్ గ్రేట్ స్టార్.. వర్మ

Published : Sep 02, 2017, 04:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
పవన్ ఫేక్ స్టార్ .. మహేష్ గ్రేట్ స్టార్.. వర్మ

సారాంశం

మహేష్ పై తనకు ఉన్న గౌరవం పదింతలు అయ్యిందన్న ఆర్జీవీ తనకన్నా విజయ్ దేవరకొండ గొప్ప నటుడని  నితిన్ఒ ప్పుకోవాలన్న వర్మ పవన్ ఫేక్ పవర్ స్టార్ అన్న వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏది చేసినా సంచలనమే. ఎందుకో తెలీదు గానీ.. ఆయనకు పవన్ కళ్యాణ్ అన్నా.. ఆయన అభిమానులన్నా పడదు. అందుకే సందర్భం ఉన్నా లేకపోయినా.. వారి మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటాడు. 

అసలు విషయానికి వస్తే.. విజయ్ దేవర కొండ హీరోగా నటించిన సినిమా ‘ అర్జున్ రెడ్డి’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా.. ఆ సినిమా చాలా బాగుందంటూ ప్రిన్స్ మహేష్ బాబు తెలియజేశారు. దీనికి ఆర్జీవీ తన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

మహేష్ బాబు అర్జున్ రెడ్డి సినిమాని ట్విట్టర్ లో పొగిడినందుకు సంతోషంగా ఉంది. ఆయనకు కుడోస్..కొత్త హీరో విజయ్ దేవర కొండను పొగడటంతో మహేష్ పై తనకు ఉన్న గౌరవం పదింతలు అయ్యిందన్నారు.

అక్కడి వరకు మహేష్ ని పొగిడితే బాగానే ఉండేది. కానీ ఇందులోకి మళ్లీ పవర్ స్టార్ ని లాక్కొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

మహేష్ తోపాటు రవితేజ, ప్రబాస్, తారక్, రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి నటులు కూడా విజయ్ దేవర కొండను పొగడటం తాను చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.

అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి.. తనకన్నా  మంచి డైరెక్టర్ అని నేను ఒప్పుకుంటున్నానని.. అలాగే.. హీరో నితిన్ కూడా విజయ్ దేవరకొండ తన కన్నా మంచి నటుడు అని ఒప్పుకోవాలన్నారు. (నితిన్ పవన్ కళ్యాణ్ ని గొప్ప అభిమాని  అన్న విషయం అందరికీ తెలిసిందే.)

అంతేకాకుండా.. నితిన్ అలా ఒప్పుకోకపోతే నిజమైన పవర్ స్టార్.. విజయ్ దేవర కొండ అవుతారని.,. పవన్ ఫేక్ పవర్ స్టార్ అవుతాడని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. మరి దీనిపై  నితిన్ ఏమంటారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?
Karthika Deepam 2 Today Episode: జ్యో, పారులకు దీప వార్నింగ్- వణికిపోయిన పారు- జ్యో ట్రాప్ లో కాశీ