పవన్ కళ్యాణ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరు-సురేఖ దంపతులు,చెర్రీ కూడా

Published : Sep 02, 2017, 03:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
పవన్ కళ్యాణ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరు-సురేఖ దంపతులు,చెర్రీ కూడా

సారాంశం

ఇవాళ జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పి.ఎస్.పి.కె.25 షూటింగ్స్ సెట్స్ కెళ్లి పవన్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరు దంపతులు పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మెగాస్టార్ దంపతులు బాబాయ్ కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను కలవడం కోసం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి వదిన సురేఖ దంపతులు పవన్ కొత్త సినిమా షూటింగ్ సెట్స్ కి రావడం సెన్సేషన్ గా మారింది. మెగా కుటుంబ పెద్ద అయిన చిరంజీవికి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో ఎప్పటి నుంచో విబేధాలు ఉన్నాయి అనేది బయట వినపడే మాట.

 

కానీ అవి రాజకీయ విబేధాలే తప్ప వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యనా ఎలాంటి వైరుధ్యం లేదు అని పదే పదే పవన్, చిరులు చెబుతున్నా... చాలా సందర్భాల్లో జనం ఈ విషయంపై తెగ చర్చించుకున్నారు. దీన్ని పటాపంచలు చేస్తూ చిరు తన సతీమణితో కలిసి త్రివిక్రమ్ – పవన్ సినిమా సెట్స్ లోకి వచ్చి పవన్ ను ఆశీర్వదించారు.

 

పవన్ కళ్యాణ్ ను, పీఎస్ పికె25 సినిమా యూనిట్ ను సర్ ప్రైజ్ చేస్తూ చిరంజీవి దంపతులు స్పాట్ కి వచ్చారు. వాళ్ల రాక పట్ల పవన్ ఆనందంతో పొంగిపోయారు. మెగా దంపతులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి పవన్ ను ఆశీర్వదించారు. అన్నావదినల నుంచి పవన్ ఆశీస్సులు అందుకున్నారు. దీంతో అక్కడి సెట్ లో పండుగ వాతావరణం నెలకొంది. అన్నదమ్ముల మధ్య ఎలాంటి అరమరికలు లేవనే విషయాన్ని స్పష్టం చేసింది.

 

మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బాబాయ్ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకంక్షలు తెలిపాడు. ఓ ప్రత్యేకమైన లోగోను తయారు చేయించి సోషల్ మీడియాలో తన డీపీగా పెట్టుకున్నాడు. పవన్ వంటి బాబాయికి కుమారుడిగా ఉండటం తన అదృష్టమని ట్వీట్ చేసిన చెర్రీ.. నిజాయతీగా ఉండటం, హార్ట్ ఫుల్ గా మాట్లాడటం, సింపుల్ గా ఉండటం లాంటివన్నీ బాబాయ్ ను చూసే నేర్చుకున్నానని చెప్పాడు. ఎంతో మందికి బాబాయ్ అండగా ఉంటారనేది తన నమ్మకమన్నాడు. మానవత్వానికి బాబాయ్ ఒక నిదర్శనమని ట్వీట్ చేశాడు చరణ్. మరోవైపు ఫ్యాన్స్.. పలువురు టాలీవుడ్ స్టార్స్ పవన్ కు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం