వెరైటీగా వెంకీ-అనిల్ రావిపూడి టైటిల్?

By Sambi Reddy  |  First Published Feb 28, 2024, 6:04 PM IST

దర్శకుడు అనిల్ రావిపూడితో నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయ్యాడు వెంకటేష్. త్వరలో అధికారిక ప్రకటన రానుండగా ఈ చిత్ర టైటిల్ పై క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. 
 


విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీతో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఇది వెంకీ 75వ చిత్రం కావడం విశేషం. ల్యాండ్ మార్క్ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సైంధవ్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకీ సోలోగా భారీ హిట్ కొడతాడు అనుకుంటే కుదర్లేదు. కొన్నాళ్లుగా వెంకీ వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. అలాగే మల్టీస్టారర్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. చాలా కాలం తర్వాత యాక్షన్ ఎంటర్టైనర్ గా సైంధవ్ చేశారు. 

సైంధవ్ ఫలితం పక్కన పెట్టి తన 76వ చిత్రానికి వెంకటేష్ సిద్ధం అవుతున్నారట. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కాంబినేషన్ సెట్ అయ్యిందని అంటున్నారు. అనిల్ రావిపూడి-వెంకీ కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు వచ్చాయి. ఎఫ్ 3 సూపర్ హిట్ కొట్టింది. ఎఫ్3 పర్లేదు అనిపించుకుంది.  ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. 

Latest Videos

ఇక అనిల్ రావిపూడి జెట్ స్పీడ్ తో సినిమాలు పూర్తి చేయడంలో దిట్ట. వెంకీ మూవీ ని త్వరలో పట్టాలెక్కించనున్నాడట. ఈ చిత్రానికి డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారట. 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ వైరల్ అవుతుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండే అవకాశం కలదు. 

అనిల్ రావిపూడి బాలయ్యతో హిట్ కొట్టాడు. భగవంత్ కేసరి హిట్ టాక్ తెచ్చుకుంది. ఫార్మ్ లో ఉన్న అనిల్ రావిపూడి వెంకీకి బ్రేక్ ఇస్తాడేమో చూడాలి. ఎఫ్ 3 మూవీలో వెంకీని అనిల్ రావిపూడి అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. వెంకీ కామెడీ టైమింగ్ ఆ మూవీలో అదుర్స్ అని చెప్పొచ్చు.. 
 

click me!