గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్... ఆ సీజన్ పై కన్నేసిన రామ్ చరణ్!

By Sambi Reddy  |  First Published Feb 28, 2024, 4:37 PM IST

రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఇది. గేమ్ ఛేంజర్ చిత్ర విడుదల తేదీ పై యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చారట. కాసులు కురిపించే ఓ సీజన్ ని ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 


గేమ్ ఛేంజర్ విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దర్శకుడు శంకర్ కారణంగా ఈ ప్రాజెక్ట్ లేటు అవుతుంది. గేమ్ ఛేంజర్ షూటింగ్ శరవేగంగా సాగుతున్న రోజుల్లో భారతీయుడు 2 తెరపైకి వచ్చింది. ఆగిపోయిన ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు. శంకర్ ఏక కాలంలో గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఎక్కువగా ఆయన భారతీయుడు 2 షూటింగ్ కి సమయం కటించాడు. దాంతో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ నత్తనడకన సాగుతోంది. 

రెండు మూడు నెలల్లో భారతీయుడు 2 ప్రాజెక్ట్ నుండి శంకర్ ఫ్రీ కానున్నాడు. నెక్స్ట్ గేమ్ ఛేంజర్ షూటింగ్ పరుగులు పెట్టించనున్నాడు. ఇక గేమ్ ఛేంజర్ విడుదలకు అద్భుతమైన డ్ డేట్ లాక్ చేయనున్నాడట నిర్మాత దిల్ రాజు. క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తే పండగ సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ లభిస్తుందని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. గత ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన సలార్ డివైడ్ టాక్ తో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. 

Latest Videos

గేమ్ ఛేంజర్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ రెండు భిన్నమైన రోల్స్ లో కనిపించనున్నాడు. రాజకీయ నాయకుడిగా, ప్రభుత్వ అధికారి పాత్రల్లో మెప్పించనున్నాడని సమాచారం. రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. సునీల్, శ్రీకాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 

click me!