NBK 107 Crazy Update: బాలయ్యతో ఢీ కొట్టబోతున్న జయమ్మ.. ఇక వెండితెరపై మోతే..

Published : Jan 05, 2022, 11:13 AM IST
NBK 107 Crazy Update: బాలయ్యతో ఢీ కొట్టబోతున్న జయమ్మ.. ఇక వెండితెరపై మోతే..

సారాంశం

NBK 107లో ముఖ్య పాత్ర కోసం కన్నడ నటుడు దునియా విజయ్‌ ని ఎంపిక చేశారు. తాజాగా మరో విలక్షణ నటిని తీసుకొచ్చారు. `క్రాక్‌`లో జయమ్మగా కనువిందు చేసిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌ని మరో ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేసింది యూనిట్‌.

నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇటీవల `అఖండ`(Akhanda) చిత్రంతో భారీ విజయాన్ని సాధించారు. 2021లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా `అఖండ` నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లని రాబట్టిన సినిమాగా Akhanda నిలిచింది. ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ స్థాయి కలెక్షన్లని రాబట్టడం మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో `క్రాక్‌` ఫేమ్‌ గోపీచంద్‌ మలినేనితో మరో పవర్‌ఫుల్‌ సినిమా చేయబోతున్నారు బాలయ్య. `ఎన్‌బీకే 107`(NBK 107) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్లు అభిమానులను అలరిస్తున్నాయి. 

ఇటీవల ఇందులో ముఖ్య పాత్ర కోసం కన్నడ నటుడు దునియా విజయ్‌ ని ఎంపిక చేశారు. తాజాగా మరో విలక్షణ నటిని తీసుకొచ్చారు. `క్రాక్‌`లో జయమ్మగా కనువిందు చేసిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌(Varalaxmi SharathKumar)ని మరో ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేసింది యూనిట్‌. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. NBK107`లోకి వెల్‌కమ్‌ చెబుతూ ట్వీట్లు చేసింది యూనిట్‌. `పవర్‌ఫుల్‌ నటి `జయమ్మ`కి వెల్‌కమ్‌. మరో  గుర్తిండిపోయే పాత్రలో కనిపించబోతున్నారు` అని ట్వీట్‌ చేశాడు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. మరోవైపు నిర్మాణ సమస్థ మైత్రీ మూవీ మేకర్స్ సైతం ఆమెకి వెల్‌కమ్‌ చెప్పింది. 

`క్రాక్‌` సినిమా చూసిన బాలకృష్ణ.. వెంటనే మరో మాట లేకుండా గోపీచంద్‌ మలినేనితో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకో సినిమా చేద్దామని చెప్పగానే దర్శకుడు గోపీచంద్‌ ఓ పవర్‌ఫుల్‌ స్టోరీని బాలయ్యకి వినిపించారు. ఆయనకు నచ్చడంతో సినిమా వెంటనే పట్టాలెక్కింది.  ఇప్పటికే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ చిత్రం షూటింగ్‌కి రెడీ అవుతుంది. ఇటీవల `అఖండ` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న బాలయ్య వెంటనే గోపీచంద్‌తో `ఎన్‌బీకే 107` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శృతి హాసన్‌ కథానాయికగా ఎంపికైంది. హీరో తప్పితే ఆల్మోస్ట్ `క్రాక్‌` కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుందని చెప్పొచ్చు.  ఇందులో బాలకృష్ణ.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని టాక్‌. 

ఇదిలా ఉంటే విలక్షణ నటిగా పేరుతెచ్చుకుంది వరలక్ష్మి. ఆమె తమిళంలో నెగటివ్‌ రోల్స్ చేస్తూ దూసుకుపోతుంది. విజయ్‌ నటించిన `సర్కార్‌`లో పవర్‌ఫుల్‌ నెగటివ్‌ రోల్‌ చేసింది. తెలుగులోనూ అలరిస్తుంది. `తెనాలి రామకృష్ణ` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అల్లరి నరేష్‌ నటించిన `నాంది`లో లాయర్‌ ఆద్యతో అదరగొట్టింది. సొంతంగా డబ్బింగ్‌ చెప్పి మెప్పించింది. దీంతోపాటు రవితేజ `క్రాక్‌`లో నెగటివ్‌ రోల్‌ చేసి అబ్బురపరిచింది. ఇప్పుడు బాలయ్య సినిమాలోనూ నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో Varalaxmi కనిపించబోతుందని టాక్‌.  ఇదే నిజమైతే వెండితెరపై మోత మోగడం ఖాయమని చెప్పొచ్చు.

also read: Purna hot Photos: స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ డ్రెస్‌లో `ఢీ` పూర్ణ అందాల పులకరింత.. పిచ్చెక్కిస్తున్న ఏంజెల్‌ లుక్స్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు