ఫ్యాన్స్ ని ఉద్దేశించి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రకటన

Surya Prakash   | Asianet News
Published : Dec 04, 2020, 08:45 AM IST
ఫ్యాన్స్ ని ఉద్దేశించి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రకటన

సారాంశం

వీటి పునరుద్ధరణకు కొన్నిరోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు నా సోషల్‌ మీడియా ఖాతాలో ఏవైనా పోస్టులు వస్తే వాటి పట్ల ఫాలోయర్లు జాగ్రత్తగా ఉండాలి. నా అకౌంట్లు పునరుద్ధరణ అయిన తర్వాత నేనే అభిమాలకు తెలియజేస్తాను’’ అని వరలక్ష్మి తెలిపారు.   

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల సోషల్‌ మీడియా అకౌంట్లు హ్యాక్‌కు గురవడం నిత్యకృత్యంగా మారింది. వారి ఎక్కౌంట్స్ ని హ్యాక్‌ చేసి అభ్యంతరకరమైన సందేశాలు, ఫొటోల్ని పోస్ట్‌ చేస్తుంటారు హ్యాకర్లు. తాజాగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ సోషల్‌ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 

వరలక్ష్మి మాట్లాడుతూ..‘‘బుధవారం రాత్రి నా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను హ్యాక్‌ చేశారు. ఈ కారణంగా వాటిలో నేను పోస్టులు పెట్టలేకున్నాను. నా ఖాతాలను పునరుద్ధరించేందుకు టెక్నికల్ టీమ్ లతో సంప్రదింపులు జరుపుతున్నాను. వీటి పునరుద్ధరణకు కొన్నిరోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు నా సోషల్‌ మీడియా ఖాతాలో ఏవైనా పోస్టులు వస్తే వాటి పట్ల ఫాలోయర్లు జాగ్రత్తగా ఉండాలి. నా అకౌంట్లు పునరుద్ధరణ అయిన తర్వాత నేనే అభిమాలకు తెలియజేస్తాను’’ అని వరలక్ష్మి తెలిపారు. 

 వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే రవితేజ ‘క్రాక్‌’, అల్లరి నరేశ్‌ ‘నాంది’ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు మార్కెట్లో మంచి క్రేజే ఉంది. అలాగే త‌మిళ్ వెబ్ సిరీస్‌లో న‌టించ‌డానికి వ‌రల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. అయితే ఇందులో ఐశ్వ‌ర్య రాజేష్ కున  స‌వ‌తిగా న‌టించ‌నున్న‌ర‌ని టాక్ న‌డుస్తోంది. ఇందులో హీరో ఎవ‌ర‌నేది ఇంకా ఫిక్స్ కాలేదు. ఎమోష‌న‌ల్ అండ్‌ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్క‌బోతుంద‌ని స‌మాచారం. దీన్ని డైరెక్ట‌ర్ సూర్య సుబ్ర‌మ‌ణ్య‌న్ తెర‌కెక్కిస్తుండ‌గా, ఆనంద్ విక‌ట‌న్ సంస్థ నిర్మిస్తుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్