మహాబలేశ్వరంలో డ్రోన్‌తో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూట్‌..లొకేషన్‌ అదిరిందిగా..!

Published : Dec 04, 2020, 07:17 AM IST
మహాబలేశ్వరంలో  డ్రోన్‌తో  `ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూట్‌..లొకేషన్‌ అదిరిందిగా..!

సారాంశం

ప్రస్తుతం మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో చిత్రీకరణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోని పంచుకుంది చిత్ర బృందం. ఇందులో పర్వత ప్రాంతంలో రాజమౌళి టీమ్‌ లొకేషన్‌ సెర్చ్ చేయగా, అనంతరం డ్రోన్‌ సహాయంతో షూటింగ్‌ జరిపారు. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెలుగులో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ `ఆర్ ఆర్‌ ఆర్‌`. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా తర్వాత ఇటీవల ప్రారంభమై కంటిన్యూగా షెడ్యూల్‌ని జరుపుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని ఆ వెంటనే పూణేలో చిత్రీకరణ స్టార్ట్ చేసింది. కరోనా వచ్చిన గ్యాప్‌ని పూర్తి చేయాలని రాత్రి పగలు షూటింగ్‌లో గడుపుతున్నారు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. 

అందులో భాగంగా ప్రస్తుతం మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో చిత్రీకరణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోని పంచుకుంది చిత్ర బృందం. ఇందులో పర్వత ప్రాంతంలో రాజమౌళి టీమ్‌ లొకేషన్‌ సెర్చ్ చేయగా, అనంతరం డ్రోన్‌ సహాయంతో షూటింగ్‌ జరిపారు. అలాగే రోడ్డుపై మోటార్‌ సైకిల్‌పై ఓ హీరో వెళ్తుండగా, కారులో కెమెరా పెట్టి చిత్రీకరిస్తున్నారు. 

ఇది చాలా చిన్న షెడ్యూల్‌ అని, అందమైన లొకేషన్‌లో, చాలా అద్భుతంగా ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పాల్గొంటున్నట్టు తెలిపారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌, ఎన్టీఆర్‌కి జోడీగా బ్రిటీష్‌ నటి ఓలీవియా మోర్రిస్‌ నటిస్తుండగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ప్రధాన హీరోల పాత్రలను పరిచయం చేసే క్రమంలో వచ్చే వాయిస్‌ ఓవర్ ని తెలుగులో చిరంజీవితో చెప్పేంచే ప్రయత్నం చేస్తున్నారట. అలాగే హిందీ వెర్షన్‌లో అమీర్‌ ఖాన్‌ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని పది భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాని రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు